సూపర్ ఆఫర్.. 12 నెలల పాటు ChatGPT ఫ్రీ.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

Published : Nov 04, 2025, 10:58 PM IST

ChatGPT Go free: ఓపెన్ ఏఐ భారత వినియోగదారుల కోసం 12 నెలల పాటు చాట్ జీపీటీ గో (ChatGPT Go) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. ఇందులో మీకు GPT-5, ఇమేజ్ జనరేషన్, డేటా విశ్లేషణ, కస్టమ్ ప్రాజెక్టు వంటి ఫీచర్లు ఉంటాయి.

PREV
15
సంవత్సరం పాటు చాట్ జీపీటీ ఉచితం

OpenAI భారత వినియోగదారుల కోసం సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. 2025 నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రమోషన్ కింద, చాట్ జీపీటీ గో (ChatGPT Go) ప్లాన్‌ను పూర్తి 12 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులు, ఫ్రీ టియర్ వినియోగదారులకు చాట్ జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.

ఈ ఉచిత ప్యాకేజ్ ద్వారా GPT-5 యాక్సెస్, అడ్వాన్స్డ్ ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్లోడ్, డేటా విశ్లేషణ టూల్స్, అలాగే కస్టమ్ ప్రాజెక్టులను సృష్టించే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. యూజర్లు వెబ్, ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు.

25
చాట్ జీపీటీ గో ప్లాన్ ఫీచర్లు ఏంటి?

చాట్ జీపీటీ గో ప్లాన్ OpenAI మధ్యస్థ సబ్‌స్క్రిప్షన్ టియర్. ఇది ఫ్రీ ప్లాన్ కంటే మెరుగైన ఫీచర్లను, ప్లస్ ప్లాన్ కంటే తక్కువ ధరలో అందిస్తుంది. ముఖ్య ఫీచర్లు గమనిస్తే..

• GPT-5 మోడల్ యాక్సెస్

• అధిక ఇమేజ్ జనరేషన్ సామర్థ్యం

• ఫైల్ అప్లోడ్స్, డేటా అనాలిసిస్ టూల్స్ (Python సపోర్ట్‌తో)

• పెద్ద కాంటెక్స్ట్ విండో, దీర్ఘకాలిక మెమరీ

• ప్రాజెక్ట్ ట్రాకింగ్, టాస్క్ మేనేజ్‌మెంట్ టూల్స్

• కస్టమ్ GPTs సృష్టించడం, ఎడిట్ చేయడం

35
చాట్ జీపీటీ గ్రో సబ్‌స్క్రిప్షన్ ఎవరికి ఉచితం?

ఈ ఆఫర్ భారతదేశంలో ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అర్హతలు గమనిస్తే..

• కొత్త చాట్ జీపీటీ యూజర్లు

• ప్రస్తుత ఫ్రీ-టియర్ యూజర్లు

• ఇప్పటికే ChatGPT Go సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు (గుడ్ స్టాండింగ్‌లో ఉన్న ఖాతాలు మాత్రమే)

అయితే ChatGPT Plus, Pro, Business, లేదా Enterprise ప్లాన్లను ఉపయోగిస్తున్నవారు ముందుగా తమ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసి, బిల్లింగ్ పీరియడ్ పూర్తయ్యాకే ఈ ఆఫర్‌ను పొందగలరు.

యూజర్లు పేమెంట్ మెథడ్ (క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ) తప్పనిసరిగా జోడించాలి. కానీ 12 నెలల ప్రమోషనల్ పీరియడ్‌లో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. యూపీఐ పేమెంట్ కోసం ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు రూ.1 తాత్కాలికంగా డెబిట్ చేస్తారు. అయితే, అది వెంటనే రిఫండ్ అవుతుంది.

45
చాట్ జీపీటీ గో ఉచిత ఆఫర్‌ను ఎలా పొందాలి?

వెబ్ యూజర్లకు

1. చాట్ జీపీటీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి లేదా పాత అకౌంట్ కు లాగిన్ అవ్వండి.

2. “Try ChatGPT Go” లేదా Settings → Account → Try ChatGPT Go క్లిక్ చేయండి.

3. పేమెంట్ మెథడ్ జోడించి చెక్అవుట్ పూర్తి చేయండి.

4. సబ్‌స్క్రిప్షన్ 12 నెలల పాటు ఆటోమేటిక్‌గా రిన్యూ అవుతుంది. ఎలాంటి ఛార్జీలు లేకుండా పూర్తవుతుంది.

ఆండ్రాయిడ్ యూజర్లకు

1. చాట్ జీపీటీ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌గా అప్‌డేట్ చేయండి.

2. “Upgrade to Go for Free” ఎంపికను క్లిక్ చేయండి లేదా Settings → Upgrade to Go for Free ద్వారా వెళ్లండి.

3. పేమెంట్ వివరాలు జోడించి చెక్అవుట్ పూర్తి చేయండి.

ఐఓఎస్ యూజర్లకు

• App Storeలో వచ్చే వారం అందుబాటులో ఉంటుంది.

• లేదా ఇప్పుడే ChatGPT వెబ్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత iOS యాప్‌లో లాగిన్ అయి ఈ సేవలు పొందవచ్చు.

55
చాట్ జీపీటీ గో ఆఫర్.. ఇది తప్పక గుర్తుంచుకోండి!

• చాట్ జీపీటీ వెబ్ లేదా యాప్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసిన యూజర్లకు ఓపెన్ ఏఐ స్వయంగా బిల్లింగ్ తేదీని 12 నెలలు పొడిగిస్తుంది.

• కానీ యాపిల్ స్టోర్ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసినవారు తమ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసి, బిల్లింగ్ పీరియడ్ పూర్తయ్యాక మళ్లీ సబ్‌స్క్రైబ్ చేయాలి.

• ప్రస్తుత బిల్లింగ్ సైకిల్‌లో ఉన్నవారికి ఎలాంటి ఛార్జ్ ఉండదు కానీ, ఉచిత పీరియడ్ తర్వాతి నెల నుండి ఆటోమెటిక్ గా ఛార్జ్ చేస్తారు.

12 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ పీరియడ్ పూర్తయ్యాక, OpenAI వినియోగదారుల నుండి సాధారణ చాట్ జీపీటీ గో ఫీజు రూ.399 వసూలు చేస్తుంది. వినియోగదారులు చెల్లింపులు జరగకముందే తమ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలు వుండవు.

Read more Photos on
click me!

Recommended Stories