ఇది క‌దా ఆఫ‌ర్ అంటే.. రూ. 55 వేల స్మార్ట్ టీవీ జ‌స్ట్ రూ. 21 వేల‌కే. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్

Published : Nov 03, 2025, 09:10 AM IST

Smart TV: పండ‌గ‌ల‌తో సంబంధం లేకుండా ఈకామ‌ర్స్ సంస్థ అమెజాన్ ఆఫ‌ర్ల వ‌ర్షం కురిపిస్తోందితాజాగా వీడబ్ల్యూ స్మార్ట్ టీవీపై స్ట‌న్నింగ్ ఆఫ‌ర్ అందిస్తోంది. ఈ డీల్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
VW 50 ఇంచెస్ టీవీ

వీడ‌బ్ల్యూ 50 ఇంచెస్ ప్రో సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ అస‌లు ధ‌ర రూ. 54,999గా ఉండ‌గా అమెజాన్‌లో ఏకంగా 58 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఈ టీవీని కేవ‌లం రూ. 22,999కి లిస్ట్ చేశారు. అయితే అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా రూ. 689 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే కొన్ని బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌తో టీవీని కొనుగోలు చేస్తే సుమారు రూ. 1500 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. ఇలా ఈ టీవీని సుమారు రూ. 21500కే సొంతం చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

25
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

VW బ్రాండ్‌కి చెందిన ఈ 50 అంగుళాల QLED స్మార్ట్ టీవీ 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తుంది. 3840x2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఉన్న ఈ టీవీకి 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ALLM (Auto Low Latency Mode), VRR (Variable Refresh Rate) సపోర్ట్ కూడా అందిస్తుంది. ఈ టీవీలో QLED డిస్‌ప్లే, Google TV ఇంటర్‌ఫేస్, HDR 10+, Pro Processor, MEMC టెక్నాలజీ, 2GB RAM + 16GB ROM, హ్యాండ్స్‌-ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.

35
కనెక్టివిటీ ఆప్షన్లు

ఈ టీవీలో మొత్తం 3 HDMI పోర్టులు (eARC సపోర్ట్‌తో) ఉన్నాయి. వీటితో సెట్‌టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్, బ్లూ రే ప్లేయర్‌లను సులభంగా కనెక్ట్ చేయవచ్చు. అదనంగా 2 USB పోర్టులు ఉన్నాయి, వీటితో హార్డ్‌డ్రైవ్‌లు లేదా పెన్‌డ్రైవ్‌లు కనెక్ట్ చేయవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉన్నాయి.

45
సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే.?

48 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో ఈ టీవీకి 2.1 ఛానల్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ సబ్‌వూఫర్ ఉంది. Dolby Audio సపోర్ట్ ఉండడం వల్ల సినిమాలు, మ్యూజిక్‌ లేదా గేమింగ్ సమయంలో క్లియర్ సౌండ్ అనుభవం లభిస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్

ఈ టీవీ ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీతో వస్తుంది, దీని వల్ల ప్రతి సీన్‌లో డార్క్, బ్రైట్ కలర్స్ స్పష్టంగా కనిపిస్తాయి. 10-బిట్ QLED ప్యానెల్, HDR10+, HLG సపోర్ట్, 1 బిలియన్ కలర్స్, Bezel-less డిజైన్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల విజువల్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.

55
బాక్స్‌లో లభించే వస్తువులు

ఈ టీవీని బుక్ చేసుకున్న వారికి.. 1 LED TV, 2 టేబుల్ స్టాండ్‌లు, 1 వాల్ మౌంట్ సెట్‌, 1 వారంటీ కార్డు, 1 రిమోట్ కంట్రోల్‌తో పాటు.. వారంటీ సేవలు బిల్ (ఇన్వాయిస్) ద్వారా పొందవచ్చు. ఇక ఈ టీవీకి సంబంధించి అమెజాన్‌లో రివ్యూలూ కూడా బాగానే ఉన్నాయి. ఒక‌వేళ టీవీని కొనుగోలు చేసే ఆలోచ‌న ఉంటే ఆ రివ్యూల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి కొనుగోలు చేయండి.

Read more Photos on
click me!

Recommended Stories