టెలికాం శాఖ BSNLకు రూ.61,000 కోట్ల 5G స్పెక్ట్రమ్‌ను ఇచ్చింది. BSNL రాబోయే మూడు నెలల్లో 5G కనెక్షన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. పూణే, కోయంబత్తూరు, కాన్పూర్, విజయవాడ, కొల్లాంలో ఇప్పటికే ట్రయల్స్ మొదలయ్యాయి. ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే BSNL రీఛార్జ్ ప్లాన్‌లు ఇప్పటికీ తక్కువ ధరలో ఉన్నాయి. 5G సేవలు అందుబాటులోకి వస్తే కస్టమర్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.