Vivo T4 5G ఖతర్నాక్ ఫీచర్లు.. ధర అందుబాటులోనే!

Published : Apr 05, 2025, 10:20 AM IST

స్మార్ట్ ఫోన్ అభిమానులకు అద్దిరిపోయే న్యూస్. ఖతర్నాక్ ఫీచర్లతో త్వరలోనే భారత్ లో Vivo T4 5G విడుదల కానుంది! స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఫాంటమ్ గ్రే, ఎమరాల్డ్ బ్లేజ్ రంగుల్లో స్టైలిష్ డిజైన్‌తో ఇది వస్తోంది. అంచనా ధర: రూ. 20,000 - రూ. 25,000.

PREV
13
Vivo T4 5G ఖతర్నాక్ ఫీచర్లు.. ధర అందుబాటులోనే!
ఫీచర్లు లీక్

భారత్‌లో 5G స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. వివో తన కొత్త Vivo T4 5G మోడల్‌ను త్వరలో విడుదల చేయనుంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తోంది. ఈ ఫోన్ మార్కెట్లో విడుదలకు ముందే దీనికి సంబంధించిన ఫీచర్లు లీక్ అయ్యాయి.

23
రంగులు ఆకర్షణీయం

Vivo T4 5G రెండు ఆకర్షణీయమైన రంగుల్లో వస్తుంది. ఎమరాల్డ్ బ్లేస్ కలర్‌లో కెమెరా సెటప్‌లో బంగారు రంగు హైలైట్‌లు అదనపు అందాన్నిస్తాయి. ఈ సెగ్మెంట్లో పోటీదారులతో పోలిస్తే ఈ రంగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

33
స్పెసిఫికేషన్లు ఇవే!

Vivo T4 5Gలో 6.67-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండవచ్చు. Vivo T4 5G వెనుకవైపు 50MP కెమెరా, ముందువైపు 32MP కెమెరాతో వస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండవచ్చు. భారత్‌లో Vivo T4 5G ధర రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ఉండవచ్చు అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories