Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10, ప్రో, ప్రో XL మోడళ్లను భారత్‌లో విడుదల చేసింది. టెన్సర్ G5 చిప్, 7 ఏళ్ల OS అప్‌డేట్‌లు, అధునాతన కెమెరా ఫీచర్లతో మార్కెట్ లోకి లాంచ్ అయింది. ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ తన తాజా స్మార్ట్‌ఫోన్ లైనప్ అయిన పిక్సెల్ 10 సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL మోడళ్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లు గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సర్ G5 ప్రాసెసర్ తో వస్తున్నాయి.
అలాగే, సెక్యూరిటీ కోసం టైటాన్ M2 కోప్రాసెసర్ ను కూడా ఇందులో ఉపయోగించారు. 7 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, పిక్సెల్ డ్రాప్ ఫీచర్లు అందించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
DID YOU KNOW ?
గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్
గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్ 3nm టీఎస్ఎంసీ టెక్‌తో నిర్మించారు. మెరుగైన AI పనితీరు, వేగవంతమైన ప్రాసెసింగ్, శక్తివంతమైన గేమింగ్ సామర్థ్యం, మెరుగైన కెమెరా ఆప్టిమైజేషన్ వంటి ప్రత్యేకతలు కలిగివుంది.
25
గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్లు, ధర
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రోటక్షన్ ను కలిగి ఉంది.
ప్రాసెసర్: టెన్సర్ G5, టైటాన్ M2
ర్యామ్ & స్టోరేజ్: 12GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ అన్ని మోడళ్లు 256GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చాయి.
గూగుల్ పిక్సెల్ 10: రూ. 79,999
గూగుల్ పిక్సెల్ 10 ప్రో: రూ. 1,09,999
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL: రూ. 1,24,999
ప్రత్యేక ఆఫర్‌గా, పిక్సెల్ 10 ప్రో, ప్రో XL కొనుగోలు చేసిన వినియోగదారులకు Google AI Pro సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తున్నారు. మొత్తానికి, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ న్యూ టెక్ ప్రాసెసర్, సెక్యూరిటీ ఫీచర్లు, అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్ తో భారత మార్కెట్ లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.