ఇప్పటికే ఏఐ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే భవిషత్తు... అని భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ రిటర్న్ ఆన్ వస్ట్మెంట్... అంటే పెట్టిన డబ్బుపై రాబడి పెద్దగా లేదు . పోనీ ప్రభుత్వాలు పెడతాయా?... అంటే అవి దివాళా చక్రవర్తులు. జిడిపి అంటే ఒక దేశం సంవత్సర సంపాదన. మీ సంవత్సర జీతం కంటే మీ అప్పు ఎక్కువ అయ్యితే మీరు అప్పుల ఊబిలో చిక్కినట్టే. జపాన్ అప్పు దాని రెండున్నర సంవత్సరాల ఆదాయం ( జిడిపి లో 238 %), అమెరికా అప్పు 124 % , ఇంగ్లాండ్ 104 % ఇలాంటి ప్రభుత్వాలు పెద్దగా లాభాలు రాని ఏఐపై ఎంత మేర పెట్టుబడి పెట్టగలవు ? అంటే కృతిమ మేథ అయిపోయినట్టేనా ? బాల్య దశలోనే మరణమా ? కాదు, కృతిమ మేథ వాస్తవం అదే భవిత. కాకపోతే ఇప్పుడున్నటు కాక... అంటే కేవలం ఉద్యోగాలను తీసెయ్యడం పైనే కాక .. మనిషి .. రోబో యంత్రం కలిసి పని చేసేలా కొత్త ఉద్యోగాల కల్పన జరగాలి, జరుగుతుంది కూడా. అప్పుడే కృతిమ మేథ ఆధారిత పరిశ్రమలు సేవారంగం నిలుస్తుంది. అంటే భవిషత్తు లో కృతిమ మేథ చేసే పనిని దానికి వదిలేసి .. అది చేయలేని పనులు పనులపై మనిషి దృష్టి పెట్టాలి .