ధర విషయానికొస్తే పోకో ఎమ్8 5జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 22,999, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 24,999గా ఉంది. ఇక లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా మొదట్టి 12 గంటల్లో కొనుగోలు చేస్తే రూ. 15,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. సాధారణ కొనుగోళ్లపై రూ.2వేలు కార్డ్ డిస్కౌంట్, రూ.1000 అదనపు డిస్కౌంట్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ అమ్మకాలు జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మొదలు కానున్నాయి.