Artificial intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని భయపెడుతోంది. మరి వచ్చే 5 ఏళ్లలో ఏఐ ఎలాంటి సంచనాలు సృష్టించనుంది.? దీంతో ఎలాంటి మార్పులు జరగున్నాయో బిట్టినింగ్ అనే ఫేస్‌బుక్ పేజీలో వివరించారు.
బిట్టినింగ్ ఫేస్‌బుక్‌లో ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న రోజుల్లో AIతో ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే డ్రైవర్‌లెస్ కారు, క్యాషియర్ వంటి ఉద్యోగాలు తగ్గుతున్నాయి. 2030 వరకు ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. ఉద్యోగాలు పోతే, ప్రజలు తమ EMIలు (car, house loan) చెల్లించలేరు. దీనివల్ల బ్యాంకులకు నష్టాలు వస్తాయి.
25
బ్యాంకుల నష్టాలు, ప్రభుత్వ బాండ్లు
బ్యాంకులు నష్టాలను కవర్ చేసేందుకు ప్రభుత్వ బాండ్లను మార్కెట్లో అమ్మడం ప్రారంభిస్తాయి. ఈ సెల్లింగ్ ప్రెషర్ వల్ల బాండ్ల ధరలు తగ్గతాయి. ధరలు తగ్గితే వడ్డీ (interest rate) పెరుగుతుంది. ఇప్పటికే ఎక్కువ అప్పు ఉన్న దేశాలు, ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
35
ముద్రణ ద్వారా సమస్య పరిష్కారం
ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకుంటాయి. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి కొత్తగా మద్రణ (money printing) ప్రారంభిస్తుంది. ఉద్యోగాలు పోతున్న సామాన్య ప్రజల కోసం కూడా డిమాండ్‌ను తీర్చడానికి మళ్లీ డబ్బు ముద్రిస్తారు.
AIకి అవసరమైన డేటా సెంటర్లు ఎంతో విద్యుత్ వాడతాయి. ఈ డిమాండ్ ప్రపంచంలో అన్ని దేశాలు తీర్చలేవు. విద్యుత్ ధరలు పెరుగుతాయి. దీని కారణంగా మార్కెట్లో ద్రవ్యోల్బణం (inflation) వస్తుంది. మరిన్ని సమస్యల పరిష్కారానికి మళ్లీ డబ్బు ముద్రించాలి.
55
భవిష్యత్తులో బంగారం ధరలు
అధిక మద్రణ, ఉద్యోగ నష్టాలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం విలువ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐ వినియోగం పెరుగుతున్న తరుణంలో బంగారం ధరలు పెరగనున్నాయి. అలాగే భవిష్యత్తులో బిట్‌కాయిన్ ధరలు కూడా ఇదే కారణంతో పెరుగుతాయి.