Mobile Photography Tips: ఇన్ స్టాలో లైకుల వర్షం గ్యారెంటీ.. నార్మల్ ఫోన్‌లోనే ప్రొఫెషనల్ ఫోటోలు తీసే 5 మైండ్ బ్లోయింగ్ టిప్స్

Published : Jun 04, 2026, 08:36 PM IST

Mobile Photography Tips: మీ మొబైల్ కెమెరాతో అదిరిపోయే ఫోటోలు, వీడియోలను తీయోచ్చు. లెన్స్ క్లీనింగ్ నుండి నైట్ మోడ్ వరకు సింపుల్ ట్రిక్స్‌తో ప్రొఫెషనల్ లుక్ లో ఫోటోలు, వీడియోలు ఎలా తీయాలి అనే 5 మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్ మీకోసం.

PREV
17
మొబైల్ కెమెరాతో నెక్స్ట్ లెవెల్ ఫోటోలు: ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసం

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కెమెరాలు చాలా అడ్వాన్స్‌డ్‌గా మారిపోయాయి. మీ దగ్గర లేటెస్ట్ మోడల్ ఐఫోన్ ఉందా లేదా కొంచెం తక్కువ బడ్జెట్ ఫోన్ ఉందా అనేది అస్సలు మ్యాటరే కాదు. కేవలం కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే చాలు, మీ నార్మల్ ఫోన్‌తోనే షార్ప్ అండ్ కంటికి ఇంపుగా ఉండే అదిరిపోయే ఫోటోలను క్లిక్ చేయవచ్చు.

మీరు ట్రిప్‌కి వెళ్ళినప్పుడు దాచుకున్న జ్ఞాపకాలు అయినా, ఫ్యామిలీ మూమెంట్స్ అయినా, లేదా మీ వర్క్ కోసం కంటెంట్ క్రియేట్ చేయాలన్నా.. మీ ఫోటోలు తీసే పద్ధతిలో కాస్త చేంజ్ చేస్తే చాలు, రిజల్ట్స్ వండర్‌ఫుల్‌గా ఉంటాయి. చాలామంది యూజర్ల ఫోన్లలో పవర్‌ఫుల్ కెమెరాలు ఉన్నప్పటికీ, వాటి పూర్తి పొటెన్షియల్‌ను ఎలా వాడాలో తెలియక వదిలేస్తుంటారు. బేసిక్ కెమెరా సెట్టింగ్స్ మార్చడం దగ్గరి నుండి ఫ్రీ ఫోటో ఎడిటింగ్ యాప్స్ వాడటం వరకు, మీ ఫోటోగ్రఫీ స్కిల్స్‌ను ఇన్‌స్టంట్‌గా మార్చేసే 5 సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం.

27
ఫస్ట్ రూల్.. ఫోటో తీసే ముందు లెన్స్ క్లీన్ చేయండి

నిజం చెప్పాలంటే, చాలామంది అస్సలు పట్టించుకోని, మర్చిపోయే అతి ముఖ్యమైన విషయం ఇదే. ఈ చిన్న మిస్టేక్ వల్లే ఫోటోలు పాడైపోతాయి. మన ఫోన్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది, జేబుల్లో వేస్తాం, బ్యాగుల్లో పడేస్తాం, ఫ్రెండ్స్ చేతుల్లో పెడతాం. దీనివల్ల కెమెరా లెన్స్‌పై దుమ్ము, వేలిముద్రలు చాలా ఈజీగా పడిపోతాయి.

ఒక చిన్న వేలిముద్ర ఉన్నా సరే, మీ ఫోటోలు మసకగా, క్లారిటీ లేకుండా వస్తాయి. అందుకే ఫోటో క్లిక్ చేసే ముందు ఎప్పుడైనా సరే ఒక మైక్రోఫైబర్ క్లాత్ లేదా సాఫ్ట్ కాటన్ క్లాత్ తీసుకుని కెమెరా లెన్స్‌ను లైట్‌గా తుడవండి. ఆ తర్వాత ఫోటో తీసి చూడండి, క్లారిటీ మీకే అర్ధమవుతుంది.

37
గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకోండి.. ప్రొఫెషనల్ కంపోజిషన్ మీ సొంతం

మీరు తీసే ఫోటోలు పర్ఫెక్ట్‌గా, ప్రొఫెషనల్ లుక్‌తో రావాలంటే మీ ఫోన్ కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి 3x3 గ్రిడ్ లైన్స్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి. ఫోటోగ్రఫీలో దీనిని రూల్ ఆఫ్ థర్డ్స్ అంటారు. ఇది మీ ఫ్రేమ్‌ను, అలాగే ఫ్రేమ్‌లో ఉన్న సబ్జెక్టును సరిగ్గా సెంటర్ లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.

మీరు తీసే ఫోటోలో ఏది ఇంపార్టంటో, ఆ పార్ట్‌ను ఈ గ్రిడ్ లైన్స్ పైన కానీ లేదా లైన్స్ క్రాస్ అయ్యే పాయింట్స్ దగ్గర కానీ వచ్చేలా సెట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు తీసే ల్యాండ్‌స్కేప్స్, పోర్ట్రెయిట్స్, లేదా మీరు తినే లంచ్ ఫోటోలు అయినా సరే చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ గా, పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి.

47
టాప్ టు ఫోకస్ అండ్ ఎక్స్‌పోజర్.. కెమెరా గేమ్‌ ఇదే

ఫోన్ కెమెరాను అలా పట్టి ఊరికే క్లిక్ చేసేయకండి. మీకు ఏ వస్తువు లేదా వ్యక్తి పర్ఫెక్ట్‌గా కనిపించాలో దానిపై స్క్రీన్ మీద టాప్ చేయండి. అది మీ కిడ్ కావచ్చు, పర్ఫెక్ట్ సన్‌సెట్ కావచ్చు, మీ ఫ్రెండ్ పెంచుకునే కుక్క కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, వాటర్‌ఫాల్ లేదా గడ్డి మేస్తున్న గుర్రం కావచ్చు.. మీకు ఏది నచ్చితే దానిపై స్క్రీన్ మీద టచ్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిక్‌గా ఫోకస్, లైటింగ్‌ను అడ్జస్ట్ చేసి పర్ఫెక్ట్ షాట్ ఇస్తుంది. అంతేకాదు, స్క్రీన్ పై లాంగ్ ప్రెస్ చేసి వేలిని పైకి, కిందికి డ్రాగ్ చేయడం ద్వారా బ్రైట్‌నెస్‌ను మీరే కంట్రోల్ చేయవచ్చు. ఆకాశం మరీ ఎక్కువ తెల్లగా కనిపిస్తే, ఎక్స్‌పోజర్‌ను కాస్త తగ్గించండి, అప్పుడు కలర్స్ థిక్‌గా మారి డీటెయిల్స్ అద్భుతంగా కనిపిస్తాయి.

57
ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ వాడండి.. ఫిల్టర్స్ దాటి ఆలోచించండి

ఫోటో తీసాక ఎడిటింగ్ చేయడం చాలా ముఖ్యం, కానీ అది ఓవర్ గా కాకుండా న్యాచురల్‌గా ఉండాలి. కేవలం ఇన్-బిల్ట్ ఫిల్టర్స్ మాత్రమే కాకుండా స్నాప్‌సీడ్, అడోబ్ లైట్‌రూమ్ మొబైల్, ఇన్‌షాట్, పిక్స్ ఆర్ట్ లేదా గూగుల్ ఫోటోస్ లాంటి ఫ్రీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. వీటిల్లో బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, కలర్ బ్యాలెన్స్, షార్ప్‌నెస్ వంటి వాటితో మరింతగా ఫోటోను మార్చవచ్చు.

ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే.. ఎడిటింగ్ ఎప్పుడూ చాలా న్యాచురల్‌గా ఉండాలి, ఎఫెక్ట్స్ ఎక్కువైపోకూడదు. చిన్న చిన్న స్మార్ట్ చేంజెస్ చేస్తే చాలు, మీ ఫోటోలు ఎడిట్ చేశారనే విషయం తెలియదు అలాగే, చాలా నీట్‌గా హైలైట్ అవుతాయి.

67
నైట్ మోడ్, హెచ్‌డీఆర్ ఎప్పుడు వాడాలో తెలుసా?

చాలామంది తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు ఈ ఫీచర్లను అస్సలు పట్టించుకోరు, కానీ వీటిని కరెక్ట్‌గా వాడితే ఫోటోల రేంజ్ మారిపోతుంది. కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే బ్రైట్ స్కై లేదా సూర్యుడికి ఎదురుగా నిలబడి ఫోటోలు తీస్తున్నప్పుడు హెచ్‌డీఆర్ మోడ్ బాగా హెల్ప్ అవుతుంది.

ఇక తక్కువ వెలుతురు ఉన్న ప్లేస్‌లలో ఫోటోలు తీయడానికి నైట్ మోడ్ మీ బెస్ట్ ఫ్రెండ్. ఇది మల్టిపుల్ షాట్స్‌ను కలిపి ఎక్కువ డీటెయిల్స్‌ను క్యాప్చర్ చేస్తుంది. అయితే ఈ మోడ్స్ వాడేటప్పుడు ఫోన్ కదలకుండా స్టడీగా పట్టుకోవడం చాలా ముఖ్యం.

77
డిజిటల్ జూమ్ వద్దు.. కాస్త ముందుకు వెళ్ళండి అంతే

దూరంగా ఉన్న వస్తువును తీయడానికి స్క్రీన్‌ను పించ్ చేసి డిజిటల్ జూమ్ అస్సలు చేయకండి. దీనివల్ల ఫోటోలు బ్లర్‌గా, పిక్సలేటెడ్‌గా పాడైపోతాయి. సాధ్యమైనంతవరకు మీరే ఆ వస్తువు దగ్గరికి వెళ్లి ఫోటో తీయండి, లేదా నార్మల్ ఫోటో తీసి ఆ తర్వాత క్రాప్ చేసుకోండి. దీనివల్ల ఇమేజ్ క్వాలిటీ తగ్గదు, ఎడిటింగ్ చేసేటప్పుడు ఫ్రేమింగ్‌ను ఈజీగా సెట్ చేసుకోవచ్చు.

అద్భుతమైన ఫోటోలు రావడానికి లక్షల రూపాయల ఖరీదైన స్మార్ట్‌ఫోన్లే ఉండాల్సిన అవసరం లేదు. లెన్స్ క్లీన్ చేయడం, పర్ఫెక్ట్ కంపోజిషన్, బేసిక్ సెట్టింగ్స్ తెలుసుకోవడం లాంటి చిన్న చిన్న విషయాలే మీ ఫోటోలను సూపర్ గా మారుస్తాయి. కొన్ని ఎడిటింగ్ యాప్స్‌తో కొంచెం ప్రాక్టీస్ చేస్తూ, ఎక్కువ ఫోటోలు తీస్తూ కొత్తగా ట్రై చేయండి. ఈ టూల్స్‌తో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే, కేవలం మీ ఫోన్‌తోనే ఆర్డినరీ మూమెంట్స్‌ను కూడా ఎక్స్‌ట్రార్డినరీ ఇమేజెస్‌గా మార్చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories