Best smartphones under 10000: చిప్ ధరలు పెరగడంతో చాలా వరకు అన్ని కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచాయి. అయితే, రూ.10వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, 50MP కెమెరా, బిగ్ బ్యాటరీతో లభిస్తున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు వివరాలు మీకోసం.
పైసా వసూల్ ఆఫర్.. అతి తక్కువ ధరలో బిగ్ బ్యాటరీ, బెస్ట్ డిస్‌ప్లే ఉన్న టాప్ ఫోన్లు ఇవే
మార్కెట్‌లో మొబైల్ ఫోన్ల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ ఫీచర్లు ఉన్న బెస్ట్ ఫోన్ వెతకడం ఒక పెద్ద టాస్క్‌గా మారిపోయింది. అయితే, బడ్జెట్ కాస్త టైట్‌గా ఉన్నా సరే.. డైలీ యూజ్‌కు అవసరమైన అద్భుతమైన ఫీచర్లను అందించే బ్రాండ్లు మార్కెట్‌లో ఇంకా ఉన్నాయి.
మీరు ఆన్‌లైన్ క్లాసులు వినడానికైనా, సోషల్ మీడియాలో ఎండ్‌లెస్ స్క్రోలింగ్ చేయడానికైనా, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వాచింగ్ చేయడానికైనా ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్ అనే ఫోన్లు ఉన్నాయి. మీరు పెట్టే ప్రతి రూపాయికి ఈ ఫోన్లు వాల్యూ ఇస్తాయి. రూ. 10,000 లోపే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే బ్యాటరీ లైఫ్, సూపర్ కెమెరాలు, మోడ్రన్ ఫీచర్లతో లభిస్తున్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలు గమనిస్తే..
27
1. మోటోరోలా మోటో G05
బడ్జెట్ రేంజ్‌లో మోటోరోలా మోటో G05 ఒక సూపర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఐపీఎస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మీ డైలీ టాస్క్‌లను ఎలాంటి లాగ్ లేకుండా ఈజీగా మేనేజ్ చేస్తుంది.
Motorola Moto G05 ధర: రూ. 7,299
37
2. శామ్‌సంగ్ గెలాక్సీ F05
మీరు బ్రాండ్ వాల్యూ చూసుకునే వారైతే, శామ్‌సంగ్ నుంచి వస్తున్న గెలాక్సీ F05 ఒక బెస్ట్ పిక్ అవుతుంది. ఇందులో 6.74 ఇంచుల ఎల్‌సీడీ స్క్రీన్ లభిస్తుంది. ఫోటోలు, వీడియో కాల్స్ కోసం 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ డివైజ్ మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అంతేకాదు, ఇందులో 5,000mAh పెద్ద బ్యాటరీని ఇచ్చారు. కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు.
రోజూవారీ పనులను సింపుల్‌గా హ్యాండిల్ చేసే నమ్మకమైన ఫోన్ కావాలనుకుంటే రెడ్‌మి A5 4G వైపు లుక్ వేయొచ్చు. ఈ ఫోన్ 6.8 ఇంచుల బిగ్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ పెద్దగా కావాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
ఇందులో 32MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉన్నాయి. ఇందులో ఉన్న యునిసోక్ T7250 ప్రాసెసర్ భారీ గేమింగ్‌కు కాకపోయినా.. బేసిక్ యాప్స్, చాటింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి వాటికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది.
Redmi A5 4G ధర: రూ. 7,999
57
4. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ
బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ అనగానే ఇన్ఫినిక్స్ ఎప్పుడూ రేసులో ముందుంటుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ ఫోన్ 6.6 ఇంచుల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఎవరూ ఊహించని విధంగా 90Hz స్లిక్ రీఫ్రెష్ రేట్ ఇవ్వడం విశేషం. దీనివల్ల ఫోన్ స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది.
ఇందులో 13MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. యునిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీతో వస్తోంది. కాబట్టి పదే పదే ఛార్జర్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
Infinix Smart 8 HD ధర: రూ. 6,699
67
5. ఐటెల్ జెనో 20 మాక్స్
ఎక్కువ హంగామా లేకుండా, కేవలం బేసిక్ ఫీచర్లు తక్కువ ధరలో కావాలనుకుంటే ఐటెల్ జెనో 20 మాక్స్ ఫోన్ చూడొచ్చు. ఈ డివైజ్ 6.6 ఇంచుల డిస్‌ప్లేతో వస్తుంది. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ తో 13MP మెయిన్ కెమెరా ఉంది.
అలాగే ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఇందులో యునిసోక్ T7100 చిప్‌ను ఉపయోగించారు. ఇది మీ సోషల్ మీడియా అకౌంట్స్ బ్రౌజ్ చేయడానికి, వీడియోలు చూసుకోవడానికి చక్కగా సరిపోతుంది.
itel Zeno 20 Max ధర: రూ. 6,999
77
మీకు ఏ ఫోన్ సూట్ అవుతుంది?
ఒకవేళ మీకు కెమెరానే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే.. మోటోరోలా మోటో G05 లేదా శామ్‌సంగ్ గెలాక్సీ F05 బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో ఇవి 50MP కెమెరాతో వస్తున్నాయి.
బిగ్ స్క్రీన్ కావాలనుకుంటే రెడ్‌మి A5 4Gని ఎంచుకోవచ్చు. స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే తక్కువ ధరలో 90Hz డిస్‌ప్లే ఇస్తున్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.