కాలిక్యులేటర్‌లోని GT, MU, M+, M-, MRC బటన్లను ఎందుకు వాడుతారో తెలుసా?

Published : Sep 13, 2025, 11:26 AM IST

Calculator button functions explained: కాలిక్యులేటర్‌లో చాలా బటన్లు మీకు కనిపిస్తుంటాయి. వాటిని ఉపయోగించి లెక్కలు మరింత సులభంగా చేయవచ్చు. అలాంటి GT, MU, M+, M-, MRC బటన్ల అర్థం ఏంటో, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
17
కాలిక్యులేటర్ లోని ఈ బటన్లకు అర్థాలు తెలుసా?

మన రోజువారీ జీవితంలో కాలిక్యులేటర్ అనేది చాలా అవసరమైన సాధనం. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు ఉన్నా కూడా షాపుల్లో, అకౌంట్స్ సెక్షన్లలో, ఆఫీసుల్లో ఫిజికల్ కాలిక్యులేటర్ వినియోగం ఇంకా కొనసాగుతోంది. సాధారణంగా యాడిషన్, సబ్‌ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కోసం మాత్రమే వాడినా, ఇందులో కొన్ని ప్రత్యేకమైన బటన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి GT, MU, M+, M-, MRC. చాలా మందికి ఇవి ఎందుకు ఉన్నాయి? ఏం చేస్తాయో తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటి అర్థం, వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.

27
కాలిక్యులేటర్ GT – గ్రాండ్ టోటల్ బటన్

GT అంటే Grand Total. పెద్ద లెక్కల తర్వాత మొత్తం ఫలితం ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు:

• 4 × 2 = 8

• 7 × 6 = 42

ఈ రెండు లెక్కలు వేర్వేరుగా చేసిన తర్వాత GT బటన్ నొక్కితే మొత్తం 50 అని చూపిస్తుంది.

ఒకేసారి పలు లెక్కలు చేసినప్పుడు చివరికి మొత్తం సొంతంగా లెక్క చెప్పే సౌకర్యం ఇది. షాపులు, అకౌంటింగ్ సెక్షన్లలో GT బటన్ చాలా అవసరమవుతుంది.

37
కాలిక్యులేటర్ MU – మార్కప్ బటన్

MU అంటే Mark-Up. వస్తువుల కొనుగోలు ధరపై లాభం, డిస్కౌంట్ లాంటి లెక్కలు వేయడానికి వాడతారు.

ఉదాహరణకి:

• మీరు ఒక వస్తువు ₹400కి కొన్నారు.

• దానిపై ₹100 లాభం కావాలి.

• కస్టమర్‌కు 20% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారు.

ఈ సందర్భంలో కాలిక్యులేటర్‌లో:

• 400 + 100 = 500 ఎంటర్ చేసి,

• MU నొక్కి 20% ప్రెస్ చేస్తే,

• ఫలితంగా ₹625 చూపిస్తుంది.

అంటే మీరు వస్తువు ధరను 625 అని చెప్పితే, 20% డిస్కౌంట్ ఇచ్చాక కూడా మీకు ₹100 లాభం వస్తుంది. ఈ బటన్ షాపింగ్ లెక్కల్లో చాలా ఉపయోగపడుతుంది.

47
కాలిక్యులేటర్ M+ – మెమరీ ప్లస్ బటన్

M+ అంటే Memory Plus. ఒక లెక్క ఫలితాన్ని మెమరీలో స్టోర్ చేసేందుకు వాడతారు.

ఉదాహరణకి: 10 × 3 = 30. దీన్ని M+ నొక్కితే, ఆ 30 మెమరీలో సేవ్ అవుతుంది. తర్వాత అవసరమైతే దీన్ని రీకాల్ చేసుకోవచ్చు.

57
కాలిక్యులేటర్ M- – మెమరీ మైనస్ బటన్

M- అంటే Memory Minus. ఇప్పటికే మెమరీలో ఉన్న ఫలితం నుండి కొత్త లెక్క ఫలితాన్ని తీసివేయడానికి వాడతారు.

ఉదాహరణకి:

• మెమరీలో 30 ఉంది.

• కొత్తగా 2 × 3 = 6 చేశారని అనుకోండి.

• ఇప్పుడు M- నొక్కితే, 30 – 6 = 24 మెమరీలో మిగులుతుంది.

67
కాలిక్యులేటర్ MRC – మెమరీ రీకాల్ బటన్

MRC అంటే Memory Recall. మెమరీలో ఉన్న మొత్తం ఫలితాన్ని చూపించే క్యాలిక్యులేటర్ బటన్.

ముందు చెప్పిన ఉదాహరణలో చివరగా MRC నొక్కితే 24 అనే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. దీని వలన పేపర్, పెన్ అవసరం లేకుండా కాలిక్యులేటర్ సులభంగా ఫలితాలు చూపిస్తుంది.

77
కాలిక్యులేటర్ లో ఈ బటన్ల ప్రాక్టికల్ ఉపయోగాలు

• షాపింగ్, బిల్లింగ్ సమయంలో డిస్కౌంట్ లెక్కలు వేయడం సులభం అవుతుంది.

• అకౌంట్స్, ఆడిటింగ్, డైలీ ఎక్స్‌పెన్స్ లెక్కల్లో వేగంగా ఫలితాలు పొందవచ్చు.

• GT బటన్ వలన వందల లెక్కలు చేసినా చివరికి మొత్తం సులభంగా తెలుసుకోవచ్చు.

• మెమరీ బటన్లు (M+, M-, MRC) వలన పెద్ద లెక్కలలో మధ్యలో రిజల్ట్ మర్చిపోవడం జరగదు.

మనందరం రోజూ వాడే కాలిక్యులేటర్‌లో ఇన్ని ఉపయోగకరమైన బటన్లు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. ఇకపై లెక్కలు వేస్తూ GT, MU, M+, M-, MRC బటన్లు వాడితే పని వేగంగా పూర్తవుతుంది. ఇప్పుటి నుంచి ఈ బటన్లను వినియోగించి లెక్కలు మరింత సులభంగా చేసుకోండి మరి !

Read more Photos on
click me!

Recommended Stories