Telecom: హైదరాబాద్‌లో మొబైల్ నెట్‌వర్క్ పనితీరుపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా రిపోర్టులో రిలయన్స్ జియో మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. 2026 మే నెలలో నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT)లో ఈ వివరాలు వెల్లడించారు.
ట్రాయ్ అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మాదాపూర్, అమీర్‌పేట్, మెహిదీపట్నం, శంషాబాద్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు మొత్తం 157.9 కిలోమీటర్ల పరిధిలో నెట్‌వర్క్ నాణ్యతను పరిశీలించారు. వినియోగదారులకు అందుతున్న డేటా వేగం, వాయిస్ కాల్స్ నాణ్యత, సిగ్నల్ స్థిరత్వం వంటి అంశాలను పరీక్షించి రిపోర్టు రూపొందించారు.
25
డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియోకు భారీ ఆధిక్యం
ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం, జియో 4G, 5G నెట్‌వర్క్‌లలో సగటున 222.12 Mbps డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. కంపెనీ ప్రకటించిన సాధారణ వేగం 15 Mbps కాగా, పరీక్షల్లో దానికి దాదాపు 14 రెట్లు ఎక్కువ వేగం నమోదైంది. అలాగే అప్‌లోడ్ స్పీడ్ కూడా 19.43 Mbpsగా నమోదై, కంపెనీ ప్రకటించిన 7 Mbps కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది.
35
సిగ్నల్ స్థిరత్వంలోనూ మెరుగైన ఫలితాలు
డ్రైవ్ టెస్ట్ సమయంలో మొత్తం 22,063 నెట్‌వర్క్ నమూనాలను పరిశీలించారు. వాటిలో కేవలం 319 చోట్ల మాత్రమే బలహీనమైన సిగ్నల్ కనిపించింది. పరీక్షలు నిర్వహించిన మొత్తం మార్గంలో ఒక్కసారి కూడా 'నో కవరేజ్' పరిస్థితి నమోదు కాలేదు. దీంతో నగరంలోని నివాస ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, శివారు ప్రాంతాల్లో కూడా జియో నెట్‌వర్క్ స్థిరంగా పనిచేస్తోందని రిపోర్ట్ సూచిస్తోంది.
డేటా స్పీడ్‌తో పాటు వాయిస్ సేవల్లో కూడా జియో మంచి ఫలితాలు సాధించింది. పరీక్షల్లో విజయవంతంగా కనెక్ట్ అయిన 202 కాల్స్‌లో ఒక్క కాల్ కూడా డ్రాప్ కాలేదు. అలాగే పరిశీలించిన 191 కాల్స్‌లో మూడు సెకన్లకు మించి నిశ్శబ్దం (కాల్ సైలెన్స్) నమోదైన ఘటన ఒక్కటి కూడా కనిపించలేదు. దీంతో వాయిస్ కాల్స్ నాణ్యత కూడా మెరుగ్గా ఉన్నట్లు ట్రాయ్ గుర్తించింది.
55
వాస్తవ పరిస్థితుల్లో నెట్‌వర్క్ నాణ్యతకు ట్రాయ్ ధృవీకరణ
టెలికాం సంస్థలు ప్రకటించే సేవల నాణ్యత నిజంగా వినియోగదారులకు అందుతోందా లేదా అనే అంశాన్ని నిర్ధారించడానికే ట్రాయ్ ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తుంది. తాజా రిపోర్ట్ ప్రకారం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ ప్రకటించిన ప్రమాణాల కంటే మెరుగైన పనితీరు కనబరిచింది. దేశంలో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు జియో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని రిపోర్ట్ పేర్కొంది.