ఇకపై కొత్త వ్యక్తులతో వాట్సాప్ లో చాట్ చేయడానికి మీ ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన పనిలేదు. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌తో ఇది సాధ్యం. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలేజీ, అపార్ట్‌మెంట్ లేదా పిల్లల స్కూల్ గ్రూపుల్లో చేరినప్పుడు మన ఫోన్ నంబర్ అందరికీ తెలిసిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్లు, ఇతర వ్యక్తిగత వివరాలు నంబర్‌తో లింక్ అయి ఉండటంతో ఇది పెద్ద ప్రైవసీ సమస్య. దీనికి పరిష్కారంగా వాట్సాప్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది…. అదే యూజర్‌నేమ్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీ ఫోన్ నంబర్ కు బదులు కేవలం యూజర్‌నేమ్ మాత్రమే కనిపిస్తుంది. దీంతో మీ ప్రైవసీకి పూర్తి భద్రత లభిస్తుంది.
25
వాట్సాప్ లో అదనపు భద్రతా ఫీచర్లు
వాట్సాప్ యూజర్లకు కొత్తగా రెండు ముఖ్యమైన భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ లేకుండా ఓ ఫీచర్ తీసుకువచ్చింది… అంటే మీ యూజర్‌నేమ్ ను ఎవరైనా ర్యాండమ్ గా సెర్చ్ చేసి తెలుసుకోవాలంటే కుదరదు. కచ్చితంగా తెలిస్తేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. రెండోది 'యూజర్‌నేమ్ కీ' సెట్ చేసుకునే అవకాశం. ఈ కీ తెలిసిన వాళ్లు మాత్రమే మీకు మొదటిసారి మెసేజ్ పంపగలరు.
35
యూజర్ నేమ్ ఇప్పుడే ఎందుకు రిజర్వ్ చేసుకోవాలి?
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. అందుకే మీకు నచ్చిన పేరును వేరొకరు తీసుకోకముందే రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ పేరు దొరక్కపోతే, వాట్సాప్‌లోని 'యూజర్‌నేమ్ జనరేటర్' మీకు సహాయం చేస్తుంది. క్రియేటర్లు, వ్యాపార సంస్థలు తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లనే ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మీ వాట్సాప్ యూజర్‌నేమ్ రిజిస్టర్ చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి. తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'అకౌంట్' ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ కొత్తగా కనిపించే 'యూజర్‌నేమ్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీకు నచ్చిన పేరును టైప్ చేసి సేవ్ చేసుకోండి.
55
యూజర్ నేమ్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌ను ప్రస్తుతం దశలవారీగా విడుదల చేస్తున్నారు. మీ అకౌంట్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే వాట్సాప్ మీకు నోటిఫికేషన్ పంపుతుంది. ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ ఈ ఫీచర్ వస్తుందని వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది.