ChatGPT : ప్రస్తుతం ప్రతిదానికి ఏఐ పై ఆధారపడటం క్రమంగా పెరుగుతోంది. అయితే, చాట్‌జీపీటీని ఈ వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతున్నారా? జాగ్రత్త! ఏఐ ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని ఇబ్బందుల్లో నెట్టేయవచ్చు.
చాట్‌జీపీటీ ని ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? నిపుణుల సీరియస్ వార్నింగ్
ప్రస్తుతం ఏఐ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ పని దగ్గరి నుండి, పర్సనల్ డౌట్స్ వరకు అందరం చాట్‌జీపీటీ లేదా గూగుల్ జెమినీ వంటి ఏఐ టూల్స్ పై ఆధారపడుతున్నాం. అయితే, మనకు తెలియకుండానే ఏఐని కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగి రిస్క్‌లో పడుతున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మీ కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాల్లో ఏఐని గుడ్డిగా నమ్మకూడదు.
కార్నెల్ యూనివర్శిటీ నిర్వహించిన ఎలిఫెంట్ అనే స్టడీ ప్రకారం.. చాట్‌బాట్‌లు మనుషుల కంటే ఎక్కువగా మనం చెప్పేదానికి అవును అని వంత పాడుతాయి. మనుషులు కేవలం 22 శాతం సందర్భాల్లోనే ఎదుటివారి అభిప్రాయాలను సమర్థిస్తే, ఏఐ మాత్రం 72 శాతం సార్లు మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటుంది. దీనివల్ల మీలో ఉన్న తప్పుడు ఆలోచనలు మరింత బలపడే ప్రమాదం ఉంది. మరి చాట్‌జీపీటీని ఏయే విషయాల్లో అడగకూడదో ఇప్పుడు చూద్దాం.
26
1. మీ వ్యక్తిత్వం గురించి ఏఐని అడగొద్దు
చాలామంది నేను చెడ్డవాడినా?, నేనంటే అందరికీ ఎందుకు ఇష్టం ఉండదు?, నా జీవితంతో నేను ఏం చేయాలి? వంటి ప్రశ్నలను చాట్‌జీపీటీని అడుగుతుంటారు. ఏఐకి భావోద్వేగాలు ఉండవు. అది కేవలం డేటా ఆధారంగా సమాధానం ఇస్తుంది. నేను ఇతరుల కంటే తెలివైనవాడినా?, నా ఆలోచనలు సరైనవేనా? అని అడిగినప్పుడు ఏఐ మిమ్మల్ని మెప్పించేలా సమాధానం ఇస్తుంది. దీనివల్ల మీరు ఒక భ్రమలో బతికే ప్రమాదం ఉంది. నిజ జీవితంలో మీ రిలేషన్ షిప్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
36
2. ఆరోగ్య సమస్యలపై చాట్‌బాట్ సలహాలు వద్దు
నాకు డిప్రెషన్ తగ్గే మార్గం చెప్పండి, నాకు గుండెనొప్పి వస్తోంది, ఇదేం జబ్బు? అని ఏఐని అడగడం చాలా ప్రమాదం. ఏఐ డాక్టర్ కాదు. నాకు క్యాన్సర్ ఉందా?, ఈ లక్షణాలు ఏ వ్యాధికి సంబంధించినవి? అని సెర్చ్ చేస్తే అది ఇంటర్నెట్‌లోని సమాచారాన్ని మిక్స్ చేసి ఏదో ఒకటి చెప్తుంది. అది చూసి మీరు భయాందోళనలకు గురయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ మందు వాడొచ్చా? అని ఏఐని అడిగి మందులు వేసుకోవడం ప్రాణాంతకం కావచ్చు. ఆరోగ్యం విషయంలో డాక్టర్‌ని కలవడమే కరెక్ట్.
నాకు బెస్ట్ కెరీర్ ఏది?, నేను విదేశాలకు వెళ్లాలా?, నాకు ఒక మంచి బిజినెస్ ఐడియా ఇవ్వు అని ఏఐని అడగడం కామన్ అయిపోయింది. కానీ ఏఐకి మీ వ్యక్తిగత సామర్థ్యం, మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ తెలియదు. అది ఇచ్చే జనరల్ సలహాలను పాటించి లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది. మీ కెరీర్ నిర్ణయాలు మీ నైపుణ్యాల మీద ఆధారపడి ఉండాలి కానీ ఒక బాట్ ఇచ్చే సలహా మీద కాదు.
56
4. ఆర్థిక, కోర్టు కేసులు
నా సేవింగ్స్ మొత్తం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?, టాక్స్ కట్టకుండా లీగల్ గా ఎలా తప్పించుకోవాలి? వంటి ప్రశ్నలు ఏఐని అడగకండి. ఆర్థిక విషయాలు చాలా సున్నితమైనవి. ఏఐ ఇచ్చే టిప్స్ ఎప్పుడూ 100% సేఫ్ కావు. అలాగే కోర్టు కేసుల గురించి, నేను ఈ కేసు గెలుస్తానా? అని అడగడం వల్ల ఉపయోగం లేదు. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి, ఏఐ పాత డేటాతో సమాధానం ఇవ్వవచ్చు.
66
5. జనరల్ నాలెడ్జ్, వైరల్ క్లెయిమ్స్
ఏదైనా అరుదైన వ్యాధి గురించి గానీ, కష్టమైన రీసెర్చ్ పేపర్ల గురించి గానీ ఏఐని అడిగినప్పుడు అది ఒక్కోసారి తప్పుడు సమాచారాన్ని నిజంలా చెప్తుంది. లేటెస్ట్ సీక్రెట్ టెక్నాలజీ ఏంటి?, సోషల్ మీడియాలో వచ్చే ఈ వార్త నిజమేనా? అని అడిగితే అది తప్పుగా గైడ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఏఐ ఇచ్చే ప్రతి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఏఐ అనేది మనకు సహాయం చేయడానికి మాత్రమే, మన జీవిత నిర్ణయాలను తీసుకోవడానికి కాదు. దానికి పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. అతిగా ఏఐపై ఆధారపడటం వల్ల మన స్వంతంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.