Amazon vs Flipkart Sale: పండుగ సేల్ రచ్చ షురూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సీక్రెట్ బ్యాంక్ ఆఫర్లు ఇవే !

Published : Oct 07, 2026, 11:00 AM IST

Amazon vs Flipkart Sale: అక్టోబర్ 8 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ పండుగ సేల్స్ ప్రారంభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా?

దేశంలోనే అతిపెద్ద పండుగ సీజన్ షాపింగ్ సందడి షురూ కాబోతోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ పండుగ సేల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ విక్రయాల్లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్‌తో పాటు అనేక కేటగిరీలకు చెందిన ప్రొడక్టులపై భారీ తగ్గింపులు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన బ్యాంకింగ్ పార్ట్‌నర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

25
సేల్ ఎప్పుడు ప్రారంభం? ఎర్లీ యాక్సెస్ వివరాలు ఇవే

అమెజాన్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్ అక్టోబర్ 8న అధికారికంగా ప్రారంభం కానుంది. ఇకపోతే, ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ 2026’ సేల్ అక్టోబర్ 9 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సబ్‌స్క్రైబర్లు, అలాగే ఎంపిక చేసిన ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అక్టోబర్ 8 నుంచే ముందస్తుగా అంటే 'ఎర్లీ యాక్సెస్' ద్వారా సేల్‌లోకి ఎంటర్ అయి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

35
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్: బ్యాంక్ ఆఫర్లు ఇవే

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రధాన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. అర్హత కలిగిన కొనుగోళ్లపై వినియోగదారులు 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ తగ్గింపు అనేది కొనుగోలు చేసే ప్రొడక్ట్, లావాదేవీ మొత్తం, ఉపయోగించే కార్డు వర్గంపై ఆధారపడి ఉంటుంది.

దీనితో పాటు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు ప్రత్యేకంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 'సూపర్ మనీ' సర్వీస్ ద్వారా చెల్లింపులు చేసేవారికి అదనంగా 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కాకపోతే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ సదరు యూజర్ చేసే మొదటి అర్హత లావాదేవీకి మాత్రమే పరిమితం. ప్రతి ఆఫర్‌కు కనీస బిల్లు మొత్తం, గరిష్ఠ డిస్కౌంట్ పరిమితులు వర్తిస్తాయి.

45
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: ఎస్‌బీఐ, అమెజాన్ పే బెనిఫిట్స్

అమెజాన్ పండుగ సేల్‌లో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్లకు ఎక్కువ ప్రయోజనాలు దక్కనున్నాయి. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఈఎంఐ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.

అమెజాన్ తన ఇతర పేమెంట్ సర్వీసెస్ ద్వారా కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఇస్తోంది. 'అమెజాన్ పే లేటర్' ఉపయోగించే కొనుగోలుదారులు అర్హత కలిగిన లావాదేవీలపై 10% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదేవిధంగా, 'అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్' ఉన్న వినియోగదారులు అమెజాన్‌లో చేసే కొనుగోళ్లపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని అందుకోవచ్చు. ఈ అపరిమిత క్యాష్‌బ్యాక్‌పై ఎలాంటి గరిష్ఠ పరిమితి ఉండదు, కానీ కార్డుకు సంబంధించిన అర్హత నిబంధనలు వర్తిస్తాయి.

55
10% డిస్కౌంట్ అంటే ఫ్లాట్ 10% తగ్గడం కాదు

ప్రకటనలలో చూపే “Up to 10%” డిస్కౌంట్ అంటే బిల్లు మొత్తంలో నేరుగా ఫ్లాట్ 10% తగ్గిపోతుందని అర్థం కాదని కస్టమర్లు గమనించాలి. మీరు చేసే అమౌంట్, బ్యాంక్ విధించిన గరిష్ఠ తగ్గింపు పరిమితి, కనీస కొనుగోలు నిబంధనలు, మీరు చేసే చెల్లింపు మోడ్ పై తుది తగ్గింపు ఆధారపడి ఉంటుంది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కొన్ని రకాల కార్డ్‌లను, ప్రొడక్ట్‌లను లేదా లావాదేవీలను ఈ ఆఫర్ల నుంచి మినహాయించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొనుగోలుదారులు చెక్అవుట్ చేసి పేమెంట్ పూర్తి చేసే ముందు తుది బిల్లుపై వర్తించిన అసలు డిస్కౌంట్‌ను క్షుణ్ణంగా సరిచూసుకోవడం మంచిది. పోటీ పోటీగా ఇస్తున్న ఈ బ్యాంక్ ఆఫర్లతో పండుగ వేళ మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్లు కొనేవారికి మంచి సేవింగ్స్ దక్కనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories