WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్: ఈ 7 తప్పులు చేస్తే మీ అకౌంట్ క్లోజ్!

Published : Oct 01, 2026, 12:17 PM IST

WhatsApp Ban 7 Mistakes: వాట్సాప్‌లో కొన్ని పొరపాట్లు చేస్తే మీ అకౌంట్ పర్మనెంట్ బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది. అకౌంట్ బ్లాక్ కాకుండా ఉండటానికి పాటించాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
వాట్సాప్ ఖాతా పర్మనెంట్ బ్యాన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌‌లలో వాట్సాప్ ఒకటి. మెటా ప్లాట్‌ఫార్మ్స్ యాజమాన్యంలో నడుస్తున్న ఈ యాప్ ద్వారా మొబైల్, డెస్క్‌టాప్‌లలో ఇంటర్నెట్ సాయంతో సందేశాలు, సమాచారం పంచుకోవడం చాలా సులభం. అయితే, వాట్సాప్ ఉపయోగించేటప్పుడు సేవా నిబంధనలు పాటించడం చాలా అవసరం. కొన్ని రకాల పొరపాట్లు లేదా నిబంధనల ఉల్లంఘన వల్ల మీ ఖాతా పర్మనెంట్‌గా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. మీ వాట్సాప్ ఖాతా సురక్షితంగా ఉండటానికి మీరు చేయకూడని 7 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

27
అన్ వాంటెడ్ మెసెజ్ లు, అపరిచిత వ్యక్తుల మెసేజ్‌లు

వాట్సాప్‌లో ఇతరులకు అనవసరమైన లేదా కోరని సందేశాలు పంపడం వల్ల మీ అకౌంట్‌పై ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించేలా మెసేజ్‌లు పంపినప్పుడు అవతలి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చు లేదా రిపోర్ట్ చేయవచ్చు.

• మీకు నచ్చని లేదా తెలియని అకౌంట్ల నుండి వచ్చే మెసేజ్‌లను ఆపడానికి సెండర్‌ను సులభంగా బ్లాక్ చేయవచ్చు.

• సదరు అకౌంట్‌పై వాట్సాప్‌కు రిపోర్ట్ చేసే సదుపాయం కూడా ఉంది.

• తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లు, కాల్స్ వల్ల ఇబ్బంది కలగకుండా ఆటోమేటిక్ వాల్యూమ్ ఫిల్టర్లను ఎనేబుల్ చేసుకోవచ్చు.

37
ఆటోమేటెడ్ లేదా ఒకేసారి ఎక్కువ మెసేజ్‌లు పంపడం

వాట్సాప్‌లో బల్క్ మెసేజ్‌లు లేదా ఆటోమేటెడ్ మెసేజ్‌లు పంపడం ప్లాట్‌ఫార్మ్ నిబంధనలకు విరుద్ధం. థర్డ్ పార్టీ యాప్‌లు ఉపయోగించి ఒకేసారి వేలాది మందికి మెసేజ్‌లు పంపితే వాట్సాప్ సెక్యూరిటీ సిస్టమ్ దానిని స్పామ్‌గా గుర్తిస్తుంది.

• వ్యాపారాలు లేదా ప్రమోషన్ల కోసం ఆటోమేటెడ్ మెసేజ్‌లు పంపాలనుకుంటే అధికారిక వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫార్మ్ ఉపయోగించాలి.

• సరైన అధికారిక మార్గాలను కాదని సాధారణ అకౌంట్ల నుండి బల్క్ మెసేజ్‌లు పంపితే ఖాతా తక్షణమే బ్యాన్ అవుతుంది.

47
ఇతరుల కాంటాక్ట్ లిస్ట్ ఉపయోగించడం

వేరొకరి అనుమతి లేకుండా వారి కాంటాక్ట్ లిస్ట్‌ను లేదా ఫోన్ నంబర్లను ఉపయోగించడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.

• అనుమతి లేకుండా ఇతరుల ఫోన్ నంబర్లను సేకరించడం లేదా షేర్ చేయడం వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించడమే.

• ప్రైవసీని కాపాడేందుకు వాట్సాప్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖాతా పర్మనెంట్‌గా సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంది.

57
బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లను పరిమితికి మించి వాడటం

వాట్సాప్‌లో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ ద్వారా ఒకేసారి పలువురికి మెసేజ్ పంపే వెసులుబాటు ఉంది. అయితే దీనిని అతిగా వాడటం వల్ల సమస్యలు తలెత్తుతాయి.

• బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లను అతిగా ఉపయోగించడం వల్ల మీ ఖాతా స్పామ్ కేటగిరీ కిందకు వచ్చే అవకాశం ఉంది.

• పరిమితికి మించి బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లు పంపితే మీ అకౌంట్ తాత్కాలికంగా సస్పెండ్ కావడం లేదా శాశ్వతంగా బ్యాన్ కావడం జరుగుతుంది.

67
వ్యక్తిగత సమాచారం సేకరించడం.. డేటా హార్వెస్టింగ్

వాట్సాప్ యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం చట్టరీత్యా, ప్లాట్‌ఫార్మ్ నిబంధనల ప్రకారం నేరం.

• ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించి లేదా అక్రమ మార్గాల్లో ఇతర యూజర్ల ప్రొఫైల్ వివరాలు, ఫోన్ నంబర్లు, సమాచారం సేకరిస్తే అకౌంట్ బ్యాన్ అవుతుంది.

• యూజర్ డేటాను సేకరించడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం. నిబంధనల ప్రకారం మెటా కంపెనీ స్వంత డేటా షేరింగ్ విధానాలపై కూడా రెగ్యులేటర్ల నుండి కఠినమైన చట్టపరమైన పరిమితులు ఉన్నాయి.

77
సేవా నిబంధనల ఉల్లంఘన.. అకౌంట్ రీయాక్టివేట్

వాట్సాప్ నిర్దేశించిన సేవా నిబంధనలను ప్రతీ యూజర్ తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ మీ అకౌంట్ పరిమితులకు గురైనా లేదా బ్యాన్ అయినా నిరాశచెందాల్సిన అవసరం లేదు.

• అధికారిక వివరాల కోసం లేదా బ్యాన్ అయిన అకౌంట్‌పై సమీక్ష అభ్యర్థించడానికి వాట్సాప్ హెల్ప్ సెంటర్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

• హెల్ప్ సెంటర్ ద్వారా మీ అకౌంట్‌పై ఉన్న ఆంక్షలను తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories