WTC 2025-27 : ఓడింది సౌతాఫ్రికా చేతిలోనే.. కానీ పరువుపోయింది పాక్ ముందు..!

Published : Nov 26, 2025, 02:49 PM IST

World Test Championship 2025-27 : సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లోనూ టీమిండియా ఓటమిపాలయ్యింది. దీంతో రెండు టెస్టుల సీరిస్ ను ఓడిపోవడమే కాదు పాకిస్థాన్ ముందు పరువు తీసుకుంది ఇండియన్ టీం. 

PREV
15
అసలిది ఇండియన్ టీమేనా..!

WTC 2025-27 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27లో టీమిండియా మరో ఘోర పరాభవాన్ని చవిచూసింది. గౌహతి టెస్ట్ లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సీరిస్ లో భారత ఆటగాళ్లు ఘోరంగా విపలమయ్యారు... సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఈ టెస్ట్ సీరిస్ ఓటమే ఇండియన్ అభిమానులను ఎంతగానో బాధపెడుతోంది... ఈ సమయంలో WTC 2025-27 పాయింట్ టేబుల్ బాధను మరింత పెంచింది. ఈ ఓటమితో భారత్ స్థానం పాకిస్థాన్ కంటే దిగజారడం అభిమానులకి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది.

25
WTC 2025-27 పాయింట్స్ టేబుల్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 లో భాగంగా టీమిండియా ఇప్పటివరకు ఇంగ్లాండ్, వెస్టిండిస్, సౌతాఫ్రికా దేశాలతో 9 టెస్ట్ మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు ఉండగా ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో WTC పాయింట్స్ టేబుల్లో టీమిండియా ఐదో స్థానానికి పరిమితం అయ్యింది... విజయశాతం 48.15, పాయింట్స్ 52 కు చేరాయి.

ఇండియా కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్ ఉంది. WTC లో కేవలం రెండుమ్యాచులే ఆడిన పాక్ ఒకదాంట్లో ఓడి, మరోటి గెలిచింది. కానీ పాక్ విజయశాతం 50 గా ఉండటంతో పాయింట్ టేబుల్లో టాప్ 4కి చేరింది… పాయింట్స్ మాత్రం కేవలం పన్నెండే. 

35
భారత్ పై విజయంతో టాప్ 2 సౌతాఫ్రికా

WTC 2025-27 పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడి అన్నింటా గెలిచింది. 100 శాతం విజయాలతో ఆసిస్ మొదటిస్థానంలో నిలిచింది.

టీమిండియాతో 2 టెస్టుల సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది సౌతాఫ్రికా. అంతకుముందు పాకిస్థాన్ తో జరిగిన 2 టెస్టుల సీరిస్ లో 1 విజయం, 1 పరాజయం ఎదురయ్యింది. ఇలా WTC లో మొత్తం 4 టెస్టులు ఆడిన సపారీలు 3 విజయాలు సాధించారు.. 75 శాతం విజయాలతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికి చేరుకున్నారు.

శ్రీలంక 66 శాతం విజయాలతో WTC పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానంలో నిలిచింది. ఈ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 2 మ్యాచులు ఆడగా ఒకటి గెలిచి మరోటి డ్రా చేసుకుంది. బంగ్లాదేశ్ తో ఈ టెస్ట్ సీరిస్ ఆడింది శ్రీలంక.

45
గౌహతి టెస్ట్ లో టీమిండియా పరాజయం

WTC 2025-27 లో భాగంగా టీమిండియా-సౌతాఫ్రికాల మధ్య రెండు టెస్టుల సీరిస్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ టెస్ట్ సీరిస్ లో టీమిండియా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కోల్ కతా టెస్టులో ఓడిన భారత జట్టు తాజాగా గౌహతి టెస్టులో అంతకంటే ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 408 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది సౌతాఫ్రికా. దీంతో బావుమా కెప్టెన్సీలో ఆఫ్రికా జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

55
జడేజా ఒంటరి పోరాటం...

రిషబ్ పంత్ కెప్టెన్సీలోని భారత్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 54 పరుగులు చేసినా జట్టు పరువును కాపాడలేకపోయాడు. మిగతా టీమిండియా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), సాయి సుదర్శన్ (14), ధ్రువ్ జురెల్ (2), రిషబ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీష్ కుమార్ రెడ్డి (0), జస్ప్రీత్ బుమ్రా (1), మహ్మద్ సిరాజ్ (0) పరుగులు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories