బీసీసీఐ చేతుల్లోనే నా భవిష్యత్తు.. గౌతమ్ గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్

Published : Nov 26, 2025, 02:46 PM IST

Gautam Gambhir : దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 0-2 వైట్ వాష్ అయింది. ఈ ఘోర పరాజయం తర్వాత కోచ్‌గా తన భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుందని గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

PREV
15
దక్షిణాఫ్రికాతో వైట్‌వాష్

గువాహటి టెస్ట్‌లో 408 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ పరాజయం చవిచూసింది. ఇదే ఇప్పుడు భారత క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. తెలిసిన పిచ్ లపై భారత్ ఇలా కూలిపోవడంతో జట్టు వ్యూహాలపై, ఆటగాళ్ల ప్రదర్శనపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి.

భారత్ ఓటమి తర్వాత జరిగిన ప్రెస్ మీట్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. భారత జట్టు చేసిన పొరపాట్లను అంగీకరిస్తూనే, భవిష్యత్తు గురించి వచ్చిన ప్రశ్నను ఓపెన్‌గా స్వాగతించారు.

25
నా భవిష్యత్తు గురించి బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గంభీర్

కోచ్‌గా కొనసాగుతారా? అన్న ప్రశ్నకు గంభీర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు... దేశం, భారత క్రికెట్‌ ముఖ్యమైనవి. నేను కాదు” అని గంభీర్ చెప్పారు.

అదే సమయంలో, గతంలో తన నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించిందని, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌ కూడా గెలుచుకుందని గుర్తు చేశారు. కానీ విజయాలతో గర్వపడకుండా, వైఫల్యాల బాధ్యతను కూడా అంగీకరించడం అవసరమని తెలిపారు.

35
టెస్ట్ క్రికెట్‌లో విజయం సమష్టి కృషి అవసరం

సిరీస్ వైట్‌వాష్‌ విషయాలు ప్రశ్నించగా, గంభీర్ ఎటువంటి కారణాలు చూపకుండా బాధ్యతను స్వయంగా ఒప్పుకున్నారు. “నింద అందరిదీ… కానీ అది నా నుంచే మొదలవుతుంది. టెస్ట్ క్రికెట్‌లో విజయం సమష్టి కృషితోనే సాధ్యమౌతుంది” అని ఆయన తెలిపారు.

జట్టు నేర్చుకునే దశలో ఉందని, ఇలాంటి పరాజయాలు విశ్లేషణకు, మెరుగుదలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. 

45
టెస్ట్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోండి

భారత క్రికెట్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఫలితాలు ఇలానే వస్తాయి. ఫార్మాట్‌ను గౌరవిస్తేనే దేశం ముందుకు సాగుతుంది” అని హెచ్చరించారు.

కేవలం వ్యక్తిగత ప్రతిభ కాదు, జట్టుగా ఆడే సామర్థ్యమే టెస్ట్ విజయాలకు కీలకమని పేర్కొన్నారు. దీంతో జట్టు ఎంపిక పై వస్తున్న ప్రశ్నల క్రమంలో మరో కొత్త చర్చ మొదలైంది.

55
భారత్‌ చెత్త రికార్డు

408 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఇది భారత టెస్ట్ చరిత్రలోనే అత్యంత దారుణ ఓటముల్లో ఒకటి. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా తొలిసారిగా క్లీన్ స్వీప్‌ చేయడం భారత క్రికెట్‌ను షాక్ కు గురిచేసింది. ఈ నేపథ్యంలో కోచ్ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

భారత జట్టుకు కొత్త ఆరంభం అవసరమా? వ్యూహాత్మక మార్పులు కావాలా? అనేది ఇప్పుడు బీసీసీఐ ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది. గంభీర్ వ్యాఖ్యలపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories