అప్పుడే ఫైనల్ విన్నర్‌ను చెప్పేసిన వికీపీడియా.. ట్రోఫీ గెలిచేది ఎవరంటే.?

Published : Nov 02, 2025, 04:55 PM IST

World Cup Final: నవంబర్ 2న నవీ ముంబైలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగగా.. కొద్దిసేపటి క్రితమే టాస్ పడింది. ఇందులో ఎవరు గెలుస్తారో ముందే చెప్పేసింది వికీపీడియా.  

PREV
15
ఫైనల్ మ్యాచ్‌పై అందరి చూపు..

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌పైనే అందరి చూపు ఉంది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా.. వారు మొదటి టైటిల్ అందుకోనున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్ ఇంకా పూర్తి కాకముందే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల ప్రపంచ కప్ విజేతను వికీపీడియా పేజీ ముందే ప్రకటించేసింది.

25
ఫైనల్‌లో 100 పరుగుల తేడాతో గెలుపు..

అవును! ఇది నిజమండీ.. మహిళల క్రికెట్ ప్రపంచకప్ అధికారిక వికీపీడియా పేజీలో ఇది ఉంది. నవంబర్ 1వ తేదీ శనివారం నాడు, ప్రపంచకప్ మునుపటి అన్ని ఎడిషన్ల టోర్నమెంట్ ఫైనల్స్ గురించి చూసినప్పుడు ఈ షాకింగ్ ప్రకటన చూడాల్సి వస్తుంది. నివేదిక ప్రకారం భారత్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 100 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

35
సోషల్ మీడియాలో వైరల్..

ఆ వికీపీడియా పేజీలో ఇది చూడగానే నెటిజన్లు అందరూ ఒకింత షాక్‌కు గురైనా.. వెనువెంటనే అందరూ స్క్రీన్‌షాట్‌లు తీసి వైరల్ చేశారు. మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది.. టాస్ కూడా కొద్ది క్షణాల ముందే పడింది. అప్పుడే విజేతను ప్రకటించడంఏంటని నెటిజన్లు మండిపడ్డారు. మరి అసలు స్టోరీ ఏంటంటే..

45
అసలు సీక్రెట్ ఇదే..

వాస్తవానికి వికీపీడియా అనేది ఒక ఓపెన్ ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ ఎవరైనా మార్పులు చేయవచ్చు. ఏ వికీపీడియా పేజీలోనైనా.. ఎవరైనా మార్పులు చేయవచ్చు. అందుకే ఈ టోర్నమెంట్ పేజీలో ఎవరో కావాలనే ఇలా చేశారని తెలుస్తోంది. కేవలం వినోదం కోసం అందులో పనిచేసే ఉద్యోగులు ఇదంతా చేశారని స్పష్టమైంది.

55
ఆ వెంటనే మార్చేశారు..

ఉమెన్స్ ప్రపంచకప్ విజేతకు సంబంధించిన ఈ చేంజ్ చూడగానే.. వికీపీడియా అధికారులు కొద్దిసేపటికే మార్చేశారు. కానీ ఆ స్క్రీన్ షాట్స్ మాత్రం ఈలోపే ఇంటర్నెట్ లో వైరల్ అయింది. కాగా, ఫైనల్ విజేత ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Read more Photos on
click me!

Recommended Stories