సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?

Published : Dec 05, 2025, 01:25 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లీ మొదట నిరాకరించినప్పటికీ, విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి సిద్ధమయ్యాడు. బీసీసీఐ నిబంధనలు, రోహిత్ శర్మ పాల్గొనడం వల్ల పెరిగిన ఒత్తిడి, అలాగే న్యూజిలాండ్ సిరీస్‌కు..

PREV
15
పదహారేళ్ళ తర్వాత..

భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పదహారేళ్ళ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబర్ 24 నుండి ప్రారంభం కానున్న ఈ మెగా వన్డే టోర్నమెంట్‌లో ఢిల్లీ తరపున పాల్గొనడానికి అతడు మొదట నిరాకరించినప్పటికీ, ఆపై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కీలక కారణాలున్నట్లు తెలుస్తోంది.

25
దేశవాళీ క్రికెట్ తప్పనిసరి

జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతి ఆటగాడు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే షరతును బీసీసీఐ విధించిన సంగతి తెలిసిందే. ఇది కోహ్లీ నిర్ణయం మార్చుకోవడానికి ఒక ప్రధాన కారణం. ఈ ఏడాది మే నెలలో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న కోహ్లీ, వన్డేలకు కూడా దూరం అవుతారనే ప్రచారం జరిగింది. అయితే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి, సెంచరీలు సాధించి తనపై వచ్చిన విమర్శలకు దీటైన జవాబు చెప్పాడు.

35
విబేధాలు తలెత్తాయి..

రాంచీ మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్‌తో కోహ్లీకి విభేదాలు తలెత్తాయనే వార్తలు కూడా వచ్చాయి. రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరూ అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లు కావడంతో, వారి మధ్య నెలకొన్న సందిగ్ధత బీసీసీఐకి పెద్ద సమస్యగా మారింది. కోహ్లీ, గంభీర్‌ల మధ్య సరైన సంభాషణ లేదని కూడా సమాచారం.

45
రోహిత్ పాల్గొనడంతో..

కోహ్లీ మొదట్లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి ఆసక్తి చూపకపోయినా, రోహిత్ శర్మ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అంగీకరించడంతో కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో, బోర్డు కోహ్లీతో మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. కోహ్లీ నిరాకరించినట్లయితే, అది ఇతర ఆటగాళ్లకు తప్పుడు సందేశాన్ని పంపవచ్చని, విరాట్‌కు బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందనే విమర్శలకు తావిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ ఆందోళన చెందింది. అందుకే బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీతో మాట్లాడి ఒప్పించినట్లు సమాచారం.

55
డొమెస్టిక్ టోర్నీ అందుకే..

బోర్డు ఒప్పించిన తర్వాత, కోహ్లీ తన సొంత జట్టు ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(DDCA)తో మాట్లాడాడు. అతడు జట్టులో చేరడం వల్ల ఢిల్లీ జట్టు బలం చేకూరుతుంది. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత, భారత్ సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి ముందు కోహ్లీకి దాదాపు ఒక నెల విరామం లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీలో ఆడడం ద్వారా తన బ్యాటింగ్ ఫామ్‌ను, ఫిట్‌నెస్‌ను కొనసాగించవచ్చని భావిస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories