గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!

Published : Dec 05, 2025, 12:46 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ నుండి కోహ్లీ, రోహిత్ శర్మలను పక్కన పెట్టాలనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, వారి ప్రస్తుత ప్రదర్శన

PREV
15
సూపర్ ఫామ్‌లో రోహిత్, కోహ్లీ

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లో కోహ్లీ వరుసగా రెండు సెంచరీలతో విమర్శకులకు సమాధానమిచ్చాడు.

25
సూపర్ సెంచరీలతో ఇక ఆపేదేలే

రాంచీలో 120 బంతుల్లో 135 పరుగులు చేయగా, రాయ్‌పూర్‌లో 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లీ వరుస సెంచరీలు సాధించడం ఇది పదకొండోసారి. ఇక వన్డే ప్రపంచకప్ 2027లో ఆడకుండా అతన్ని ఎవరూ ఆపలేరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

35
వారు అడ్డుకున్నా.. నో ప్రాబ్లం..

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ 2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఆడించకూడదని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, వారిద్దరి ప్రస్తుత బ్యాటింగ్ ప్రదర్శన.. వారిని జట్టు నుండి పక్కన పెట్టడం కష్టమని, అసాధ్యమని రుజువు చేస్తోంది.

45
ఇద్దరూ ఇచ్చిపడేశారు..

2027 ప్రపంచకప్ సమయానికి ఇద్దరికీ దాదాపు 39 ఏళ్లు వస్తాయి. తమ అర్ధ సెంచరీలు, సెంచరీలతో జట్టుకు తాము ఎంత ముఖ్యమో మరోసారి నిరూపిస్తున్నారు ఈ ఇద్దరు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా గత మూడు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు.

55
దిగ్గజాలు ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే..

ఇద్దరూ టీ20, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుత భారత జట్టులో, ప్రత్యర్థి జట్టులో కూడా రోహిత్, విరాట్ స్థాయిలో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ లేరని మాజీలు, అభిమానులు అంటున్నారు. 2027 ప్రపంచకప్ గెలవాలంటే ఈ ఇద్దరు దిగ్గజాలు జట్టులో ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. వారి ప్రస్తుత ఫామ్ కొనసాగితే ప్రపంచకప్ జట్టు నుంచి వారిని తప్పించడం ఎవరి వల్ల కాదని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories