Prasidh Krishna: భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా బౌలింగ్ బలహీనత బయటపడింది. ప్రసిద్ద్ కృష్ణ 8.2 ఓవర్లలో 85 పరుగులు సమర్పించుకుని అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా, సిరాజ్ లేకపోతే భారత బౌలింగ్ ఇంతేనని..
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి వన్డేలో ఓడిన సౌతాఫ్రికా, రెండో వన్డేలో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయవంతంగా ఛేదించి సూపర్ విక్టరీని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. డిసెంబర్ 6న వైజాగ్లో జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. అయితే, 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా సులభం కాదు. దీనిని సౌతాఫ్రికా ఛేదించడం ప్రత్యర్థి బౌలింగ్ బలహీనతను స్పష్టం చేస్తోంది.
25
రెండో వన్డేలో వాడే విలన్
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా ప్రసిద్ద్ కృష్ణ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు సమర్పించుకున్నాడు. పది ఓవర్లు పూర్తి చేసి ఉంటే సెంచరీ పరుగులు ఇచ్చేవాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రెండు వికెట్లు తీసినప్పటికీ, అతని పేలవమైన ఎకానమీ(ఓవర్‌కు 10 పరుగులకు పైగా) జట్టుకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు. టీమిండియాకు ప్రసిద్ద్ కృష్ణ కంటే మెరుగైన బౌలర్లు లేరా అని అభిమానులు బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు.
35
ఆ ఇద్దరికీ రెస్ట్ ఇస్తే..
బుమ్రా, సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వగా, అర్ష్‌దీప్ సింగ్ వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ ముగ్గురు మినహా టీమిండియాలో నిలకడగా రాణించే బౌలర్లు కనిపించడం లేదనే ఆందోళన నెలకొంది. హర్షిత్ రాణాను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చే ప్రయత్నంలో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. రెండో వన్డేలో హర్షిత్ రాణా కూడా ఓవర్‌కు ఏడు ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.
బుమ్రా, హార్దిక్ పాండ్యాల తర్వాత టీమిండియా బౌలింగ్ పరిస్థితి ఏంటో అంతుచిక్కట్లేదు. వీళ్లిద్దరూ ఎన్నేళ్లపాటు క్రికెట్ ఆడతారో తెలియదు. బౌలర్లను తయారు చేయడంలో ఎన్‌సీఏ, స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ దారుణంగా విఫలమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా విదేశీ బౌలర్లు, భారత స్పిన్నర్లు రాణిస్తున్నారే తప్ప, భారత పేసర్లు వైఫల్యం చెందుతున్నారు. రాణించిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా వంటి వారు మాత్రమే ఉన్నారు.
55
చేజింగ్ చేస్తేనే గెలుపు..
ఈ వన్డే సిరీస్‌లో భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోతోందని చెప్పొచ్చు. బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ చాలా బలహీనంగా మారుతోంది. తొలి వన్డేలో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ రాణించి ఉంటే, ఆ మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోయేది. అదృష్టవశాత్తూ భారత్ ఆ మ్యాచ్‌లో గెలిచింది. మూడో వన్డేలో భారత్ గెలవాలంటే ఒకే ఒక మార్గం ఉంది: భారత్ ఛేజ్ చేయాలి. మరోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం సిరీస్ సౌతాఫ్రికా చేతికి వెళ్ళడం ఖాయం.