టెస్టుల్లో తోపు కెప్టెనా.? పంత్‌పై ఇదేం దిక్కుమాలిన చర్చరా బాబూ..

Published : Nov 25, 2025, 10:00 AM IST

Rishabh Pant: టీమ్ ఇండియా సౌతాఫ్రికాతో మరికొన్ని రోజుల్లో జరగనున్న వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. శుభ్‌మాన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా, రిషబ్ పంత్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ వన్డే సిరీస్‌కు సారథ్యం దక్కలేదు. 

PREV
15
రిషబ్ పంత్‌కు వన్డే కెప్టెన్సీ..

భారత జట్టు ప్రస్తుతం గువాహటిలో సౌతాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. అయితే, మరికొద్ది రోజుల్లో సఫారీలతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. రెండో టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్‌కు వన్డే కెప్టెన్సీ లభించకపోవడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

25
ఆడింది ఒకే ఒక వన్డే

రిషబ్ పంత్ గత సంవత్సరం కాలంలో కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడినందున అతనికి కెప్టెన్సీ దక్కలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. శుభ్‌మాన్ గిల్ మెడ నొప్పితో కోల్‌కతా టెస్టు నుంచి వైదొలగగా, మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో వన్డే సారథ్య బాధ్యతలు కేఎల్ రాహుల్‌కు అప్పగించారు.

35
గిల్ రీ-ఎంట్రీ అప్పుడే..

గాయపడిన గిల్ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ నాటికి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. నవంబర్ 30వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చారు. భారత్ ఏ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను వన్డే జట్టులోకి తీసుకున్నారు. అలాగే తిలక్ వర్మ కూడా తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.

45
పంత్ పేలవ షాట్..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జరుగుతోన్న రెండు టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా తక్కువ పరుగులకే ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా ఈ టెస్టులో పట్టుబిగించింది. మరోసారి కివిస్‌తో జరిగిన వైట్‌వాష్ ఈ సిరీస్‌లో కూడా జరిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

55
రంజీ మ్యాచ్‌లలో ఆడాలి..

అటు స్వదేశంలో టీమిండియా వరుస ఓటములు కారణంగా కోచ్ గంభీర్ సామర్ధ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా దీనిపై స్పందిస్తూ.. వరుస ఓటములు ఎదుర్కున్నప్పుడు.. ఆ కోచ్‌ను డొమెస్టిక్, రంజీ మ్యాచ్‌లకు పర్యవేక్షణ చేయించాలని.. అక్కడ తన సత్తా చాటుకున్నాక.. తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడించాలని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories