తెలుగు ప్లేయర్ కు గంభీర్ షాక్.. తిలక్ వర్మ ఎందుకు ఆడటం లేదు?

Published : Nov 08, 2025, 03:35 PM IST

Tilak Varma: బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా 5వ టీ20 నుంచి తెలుగు ప్లేయర్ తిలక్ వర్మను తప్పించారు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్లేయింగ్ 11 పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

PREV
16
భారత్ జట్టులో మార్పులు.. తిలక్ వర్మ అవుట్

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ శనివారం (నవంబర్ 8) న బ్రిస్బేన్‌లోని ది గబ్బా మైదానంలో జరుగుతోంది. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు విజయం ద్వారా సిరీస్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ ను ఆడించడం లేదు. అతని స్థానంలో జట్టులో రింకూ సింగ్‌కు అవకాశం లభించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో “తిలక్ విశ్రాంతి తీసుకుంటున్నారు, రింకూ జట్టులోకి వచ్చాడు” అని తెలిపారు.

అయితే, గత మ్యాచ్ లలో తిలక్ వర్మ నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రాలేదు. అతని ఫామ్ ను పరిగణలోకి తీసుకుని జట్టు నుంచి తప్పించారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తిలక్ వర్మ గత మూడు మ్యాచ్‌ల్లో 0, 29, 5 రన్స్ మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో గొప్పఫామ్ లో లేకపోవడంతోనే జట్టు మేనేజ్‌మెంట్ ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇక రింకూ సింగ్ తన ఫినిషింగ్ సామర్థ్యంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు.

26
తిలక్ వర్మకు షాక్.. రోటేషన్ ప్లాన్ కారణమా?

భారత జట్టు తిలక్ వర్మను విశ్రాంతి ఇవ్వడం వెనుక ప్రధాన కారణం రోటేషన్ పాలసీ అని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026 ముందుగానే వివిధ కాంబినేషన్లను పరీక్షించాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. తిలక్ ఈ ఏడాది టీ20ల్లో 16 మ్యాచ్‌ల్లో 380 పరుగులు చేసి మంచి ఫార్మ్‌లో ఉన్నా, సిరీస్‌లో తక్కువ స్కోర్లు రావడంతో జట్టులో మార్పు చేశారు.

ఇక రింకూ సింగ్ ఈ ఏడాది భారత జట్టులో ఒక విశ్వసనీయ ఫినిషర్‌గా నిలిచాడు. 34 టీ20ల్లో 550 పరుగులు చేసి, 160కు పైగా స్ట్రైక్‌రేట్ సాధించాడు. ఇటీవల ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ఆఖరి బంతిలో భారత్‌కు విజయాన్ని అందించాడు.

36
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. “ఈ మైదానం చాలా అద్భుతంగా ఉంటుంది. సిరీస్ సమం చేసే అవకాశం ఉంది. ఇరుజట్లు మంచి క్రికెట్ ఆడుతున్నాయి” అని మార్ష్ పేర్కొన్నారు.

ఇక సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “టాస్ ఓడినా మ్యాచ్ గెలవడం ముఖ్యం. జట్టు లక్ష్యం అదే. గత మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చాం. అదే విధంగా కొనసాగించాలని చూస్తున్నాం” అని అన్నారు.

46
ఇరు జట్లలో మార్పులేంటి?

భారత జట్టులో తిలక్ వర్మకు విశ్రాంతి ఇవ్వడంతో రింకూ సింగ్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన టీమ్ తోనే బరిలోకి దిగింది.

భారత్ (Playing XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా (Playing XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా,

56
సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్ వైరల్

సూర్యకుమార్ యాదవ్ జట్టు కూర్పుపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. “ఈ ఫార్మాట్‌లో ఓపెనర్లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్లు ఏ స్థానంలోనైనా ఆడేలా సిద్ధంగా ఉండాలి. టాస్ ఓడినా గెలుపు ముఖ్యమని భావిస్తున్నాం. గత మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాము. ఈ మ్యాచ్ లో కూడా అదే కొనసాగించాలనుకుంటున్నాము” అని తెలిపారు.

దీంతో సూర్య వ్యాఖ్యలు భారత జట్టు రోటేషన్ స్ట్రాటజీని స్పష్టంగా ప్రతిబింబించాయి. తిలక్ విశ్రాంతి తీసుకోవడం, రింకూ సింగ్ ఆడే అవకాశం పొందడం రాబోయే ప్రపంచకప్ దృష్ట్యా జట్టుకు ప్రయోజనం కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, గంభీర్ చేస్తున్న ఈ ప్రయోగాలు భారత జట్టుకు ప్రతికూలంగా కూడా మారే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది.

66
సిరీస్ గెలవాలనే లక్ష్యంతో భారత్, సమం చేయాలనుకుంటున్న ఆస్ట్రేలియా

భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మూడు, నాల్గో మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. గబ్బా మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్‌ను 2-2గా సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories