Asia Cup: భారత్ 2025 ఆసియా కప్‌ను గెలిచినప్పటికీ ట్రోఫీ ఇప్పటికీ అందలేదు. సూర్యకుమార్ యాదవ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో వివాదం మొదలైంది.
2025 సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను వరుసగా మూడుసార్లు చిత్తు చేసింది.
25
విన్నింగ్ ట్రోఫీ అందలేదు..
అయితే, ఈ విజయం సాధించి మూడు నెలలు గడిచినా టీమిండియాకు మాత్రం విన్నింగ్ ట్రోఫీ అందలేదు. సాధారణంగా టోర్నమెంట్ గెలిచిన వెంటనే విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తారు. కానీ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటివరకు ఆ ట్రోఫీని భారత్‌కు ఇవ్వలేదు.
35
వివాదం మొదలైంది అప్పుడే..
ఈ వివాదమంతా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయంతో మొదలైంది. పాకిస్థాన్ హోం మంత్రి, పీసీబీ అధ్యక్షుడు, ఏసీసీ అధ్యక్షుడైన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి సూర్య నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన నఖ్వీ ట్రోఫీని తీసుకుని మైదానం నుంచి వెళ్లిపోయాడు.
ఈ ట్రోఫీని దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ కాంప్లెక్స్‌లో ఉన్న ఏసీసీ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. బీసీసీఐ, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మధ్య ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు.
55
ఐసీసీ మధ్యలో వచ్చినా..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి సానుకూల ఫలితం కనిపించడం లేదు. మరి భారత్‌కు దక్కాల్సిన తన హక్కు, అంటే ఆసియా కప్ విజేత ట్రోఫీ, ఎప్పుడు అందుతుందో వేచిచూడాలి.