Shubman Gill: టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపికైన భారత జట్టులో స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పేరు లేని సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ సెలెక్టర్లను తప్పుబట్టారు. కేవలం కొన్ని వైఫల్యాలు కారణంగా గిల్‌ను తొలగించడం సరికాదని..
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించారు. గిల్‌ను జట్టులో తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
25
కేవలం నాలుగైదు ఇన్నింగ్స్‌లో..
శుభ్‌మాన్ గిల్ కేవలం నాలుగైదు ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రాన అతన్ని ఎలా తొలగిస్తారని యోగ్‌రాజ్ ప్రశ్నించారు. భారత క్రికెట్‌లో చాలామంది ఆటగాళ్లకు తాము ఉన్నామని భరోసా ఇచ్చిన సెలెక్టర్లు గిల్‌ను ఎందుకు పక్కన పెట్టారు అని ఆయన నిలదీశారు. గతంలో కపిల్ దేవ్ ఫామ్ కోల్పోయినప్పుడు బిషన్ సింగ్ బేడీ అతనికి ఎలా తోడుగా నిలిచారో యోగ్‌రాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత సెలెక్టర్లు గిల్ విషయంలో ఆ సహనం చూపించడం లేదని ఆయన విమర్శించారు.
35
టీ20ల్లో గిల్ ఫెయిల్..
శుభ్‌మాన్ గిల్ గతేడాది టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతడు ఆడిన 15 మ్యాచుల్లో 24.25 సగటుతో 291 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 137.26గా ఉంది. ఈ మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ ఒక్క కారణంతోనే గిల్‌ను టీ20 ప్రపంచకప్ నుంచి తొలగించారు అని అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.
గిల్ తొలగింపుపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. గిల్ ప్రతిభావంతుడైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుత ఫామ్, జట్టు కాంబినేషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అగార్కర్ తెలిపాడు.
55
ఇషాన్ కిషన్ ఎంపిక అందుకే..
టాప్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం అని భావించి, యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించాడు. జట్టు కూర్పులో సమతుల్యత సాధించడమే లక్ష్యమని అగార్కర్ స్పష్టం చేశాడు. యోగ్‌రాజ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.