రెండో రోజు సఫారీ జట్టు ఆట పూర్తిగా ఆధిపత్యంతో సాగింది. ఉదయం సెషన్‌లో వికెట్ కోల్పోకుండా పరుగులు జోడించిన జట్టు, తర్వాతి సెషన్‌లో ముత్తుసామి, యాన్సెన్ జంట భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. యాన్సెన్ 91 బంతుల్లో 93 పరుగులతో దూకుడుగా ఆడుతూ దక్షిణాఫ్రికా స్కోరును వేగంగా పెంచాడు.
ట్రిస్టన్ స్టబ్స్ (49), టెంబా బావుమా (41), మార్క్రమ్ (38), రికెల్టన్ (35), వెరినె (45) ఇన్నింగ్స్‌కు పటిష్టమైన పునాది వేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లను, జడేజా, సిరాజ్, బుమ్రా చెరో 2 వికెట్లను సాధించారు. రెండో రోజు ముగిసే సమయానికి భారత్ 6 ఓవర్లు మాత్రమే ఆడి 9/0తో నిలిచింది. యశస్వి జైస్వాల్ (7*), కేఎల్ రాహుల్ (2*) క్రీజులో ఉన్నారు.