break dancing in the Olympics : బ్రేక్ డ్యాన్స్ ఎంతో ప్రత్యేకమైనది. ఈ రకమైన డాన్స్ స్టైల్ లో ఫ్రీజ్‌లు, పవర్‌మూవ్‌లు, డౌన్‌రాక్, టాప్‌రోక్‌లతో సహా ప్రామాణిక స్టెప్పులు, వివిధ దశల్లో స్పెషల్ గా వైవిధ్యంతో ఉంటాయి. పారిస్ ఒలింపిక్స్ లో 'బ్రేక్ డాన్స్' పోటీలు కూడా ఉన్నాయి.
Why is break dancing in the Olympics : ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు ప్రతిసారి కొన్ని కొత్త క్రీడలను పరిచయం చేస్తున్నారు. అలాగే, పారిస్ లో జరగబోయే విశ్వక్రీడల్లో 'బ్రేకింగ్ డాన్స్' పోటీలు కూడా చేరాయి.
27
2024 పారిస్ ఒలింపిక్ గేమ్స్‌లో పట్టణ నృత్య శైలి అయిన 'బ్రేకింగ్ డాన్స్' కొత్త క్రీడగా వచ్చి చేరింది. బ్రేక్ డ్యాన్స్ ఎంతో ప్రత్యేకమైనది.
37
ఈ రకమైన డాన్స్ స్టైల్ లో ఫ్రీజ్‌లు, పవర్‌మూవ్‌లు, డౌన్‌రాక్, టాప్‌రోక్‌లతో సహా ప్రామాణిక స్టెప్పులు, వివిధ దశల్లో స్పెషల్ గా వైవిధ్యంతో ఉంటాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) యువతను ఆకర్షించడానికి బ్రేకింగ్ డాన్స్ ను పోటీల్లోకి తీసుకువచ్చింది.
47
బ్రేకింగ్ డాన్స్ స్టైల్ 1970లలో న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్‌లో ఉద్భవించింది. ఇది విన్యాస కదలికలు, శైలీకృత ఫుట్‌వర్క్ తో చేసే విభిన్నమైన డాన్స్.
57
బ్రేకింగ్ మొదట బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో చేర్చారు. అప్పటి క్రీడల్లో ఇది విజయవంతమైంది. విశ్వక్రీడలకు యువతను ఆకర్షించడంలో బాగా ప్రభావం చూపింది.
67
పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ 2024 లో రెండు బ్రేకింగ్ డాన్స్ ఈవెంట్‌లు ఉన్నాయి. ఒకటి పురుషులకు, మరొకటి మహిళలకు సంబంధించింది. అవి 16 'బి-బాయ్స్' & 'బి-గర్ల్స్'.
77
అయితే, బ్రేకింగ్ డాన్సు పోటీలలో విజేతలను ఎలా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జడ్జీలు సృజనాత్మకత, వ్యక్తిత్వం, సాంకేతికత, వైవిధ్యం, ప్రదర్శన. సంగీతం ఆధారంగా స్కోర్లు ఇస్తారు. దీని కోసం ముగ్గురు జడ్జీలు ఉంటారు.