Paris 2024 Olympics, India
Paris Olympics India : పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఫ్రాన్స్ రాజధానిలో జరిగే ఈ విశ్వక్రీడలలో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. గత ఒలింపిక్స్ లో గెలిచిన పతకాల కంటే డబుల్ మెడల్స్ గెలుచుకోవాలని భారత భావిస్తోంది.
అయితే, భారత్ కు పారిస్ ఒలింపిక్స్ లో ఐదు మెడల్స్ దక్కడం పక్కాగా కనిపిస్తోంది. గత ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒకే ఒక్క స్వర్ణం గెలుచుకోగా, అది నీరజ్ చోప్రా సాధించాడు. అలాగే, 2 రజతం, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు వచ్చాయి.
గత ఒలింపిక్ చాంపియన్లలలో ఐదుగురు మరోసారి పారిస్ ఒలింపిక్స్ లో కూడా భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇద్దరు రెజ్లర్లు రవి దహియా (రజతం విజేత), బజరంగ్ పునియా (కాంస్య విజేత) ఈసారి లేరు.
గత ఒలింపిక్ లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈసారి మళ్లీ జావెలిన్ త్రో ఈవెంట్‌లో స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.
వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకోవాలని చూస్తోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. ఈసారి భారత మహిళల జట్టు జెండా మోస్తున్న సింధు ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది.
Olympics
మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్‌లో తన పంచ్‌ల శక్తిని ప్రదర్శించి కాంస్యం సాధించింది. అయితే ఈసారి కూడా మెడల్ గెలుచుకోవాలని పక్కా ప్లాన్ తో రింగులోకి దిగుతోంది.
Indian Men's Hockey Team
8 సార్లు ఒలింపిక్ స్వర్ణం సాధించి రికార్డు సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు ఈసారి కూడా స్వర్ణ పతకం సాధిస్తుందనే ధీమాతో ఉంది. చివరి ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకుంది.