SRH: సఫరీలతో టీ20లు స్టార్ట్ కాకముందే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌పై అదిరిపోయే సెంచరీ పూర్తి చేశాడు.
సఫారీలతో టీ20లు మొదలు కాకముందే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.
25
టీ20ల్లో 300 కొట్టేశారు..
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫామ్ చూస్తే కచ్చితంగా టీ20ల్లో 300 కొట్టేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కాటేరమ్మ కొడుకు సారధ్యంలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌పై పంజాబ్ 20 ఓవర్లలో 310/5 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలోనే ఇదే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్. ఓవరాల్‌గా టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్.
35
భారత యువ ఆటగాళ్ల జోరు..
ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ అభిషేక్ శర్మ 148 పరుగులు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 70 పరుగులు, రమణ్‌దీప్ 39 పరుగులు చేసి అదరగొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ బ్యాటర్లు ఏకంగా 28 సిక్సర్లు బాదారు. కాగా, 32 బంతుల్లోనే సెంచరీ సాధించిన అభిషేక్.. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రికార్డుల మోత మోగించాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్యాటర్లలో ఒకడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ రికార్డు 32 బంతుల్లో కొట్టాడు. అలాగే 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డు సమం నిలిచాడు. అటు టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది SMATలో 151 రన్స్ చేసిన తిలక్ వర్మ తొలి స్థానంలో ఉన్నాడు.
55
టీ20లకు వార్మప్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. మరికొద్ది రోజుల్లో సఫారీలతో జరగబోయే టీ20 సిరీస్‌కు ఇదొక వార్మప్‌లా ఉంది. ఇప్పటికే టీ20 క్రికెట్‌లో బౌలర్లను భయపెడుతున్న అభిషేక్.. సఫారీలను కూడా వణికిస్తాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.