Published : Oct 23, 2025, 12:36 PM ISTUpdated : Oct 23, 2025, 01:42 PM IST
Virat Kohli retirement : విరాట్ కోహ్లీకి అడిలైడ్ లో డబుల్ డక్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో వరుసగా రెండో మ్యాచ్ లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. గ్రౌండ్ వీడుతున్న సమయంలో అభిమానుల వైపు గుడ్‌బై వేవ్ చెప్పడంతో రిటైర్మెంట్ రూమర్స్ ఊపందుకున్నాయి.
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఆడిలైడ్ వేదికగా చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో కూడా కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇది ఆయన వన్డే కెరీర్‌లో తొలిసారి వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో డక్ అవ్వడం. పెవిలియన్ కు చేరుతున్న సమయంలో ఆయన అడిలైడ్ ప్రేక్షకులను చూసి చేతులు ఊపగా, అది ఆయన రిటైర్మెంట్‌కు సంకేతమా అనే చర్చ మొదలైంది. అభిమానుల వైపు గుడ్‌బై వేవ్ చెప్పడం వెనకున్న కారణం ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
26
వరుసగా రెండు డక్‌లు.. కోహ్లీ కెరీర్‌లో అరుదైన సంఘటన
వరుసగా రెండు డకౌట్లు.. కోహ్లీ క్రికెట్ కెరీర్‌లో ఎన్నడూ జరగని ఘటన ఇది. అక్టోబర్ 19న పెర్త్ జరిగిన మొదటి వన్డేలో మిచెల్ స్టార్‌క్ బౌలింగ్‌లో కోహ్లీ ఎనిమిది బంతులు ఆడి డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. మూడు రోజుల తరువాత అంటే అక్టోబర్ 23న అడిలైడ్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లో జేవియర్ బార్ట్‌లెట్ వేసిన ఇన్‌స్వింగ్ డెలివరీతో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. కేవలం నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.
అడిలైడ్ ఓవల్ కోహ్లీకి ఇష్టమైన వేదిక. ఈ మైదానంలో ఆయన ఇప్పటివరకు 976 పరుగులు సాధించాడు. ఇక్కడ ఒక విదేశీ ప్లేయర్లు సాధించిన అత్యధిక పరుగుల రికార్డు ఇది. అయితే ఈసారి డక్ అవ్వడంతో నిరాశతో పెవిలియన్ కు చేరేటప్పుడు అభిమానులు నిలబడి చప్పట్లు కోట్టారు.. దీనికి ప్రతిగా ఆయన చేతులు ఊపడం గమనార్హం. అదే ఆయన చివరి మ్యాచ్ సంకేతమా అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. సోషల్ మీడియాలో “కోహ్లీ ఈ గుడ్‌బై వేవ్‌తో వన్డేలకు వీడ్కోలు పలికాడా?” అనే చర్చ నడుస్తోంది.
విరాట్ కోహ్లీ డన్ విత్ క్రికెట్.. సోషల్ మీడియాలో వైరల్
కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. కొంతమంది “విరాట్ కోహ్లీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు” అని పోస్టులు చేస్తుండగా, మరికొందరు “ఈ తరహా జెస్టర్ సాధారణ ధన్యవాదాలు తెలిపే సూచన మాత్రమే కావచ్చు” అని కామెంట్స్ చేస్తున్నారు.
ఒక యూజర్ తన పోస్టులో “సచిన్ టెండూల్కర్ 2011 తర్వాత రిటైర్మెంట్ దిశగా ఎలా వెళ్లాడో, కోహ్లీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది” అని పేర్కొన్నాడు. మరొకరు “కోహ్లీ ఇచ్చిన ఎన్నో అందమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు” అంటూ భావోద్వేగంగా స్పందించాడు.
56
కోహ్లీ వన్డే రికార్డులు, ప్రస్తుత ఫామ్
కోహ్లీ ఇప్పటివరకు 303 వన్డేల్లో 14,181 పరుగులు సాధించాడు. ఆయన బ్యాటింగ్ సగటు 57.65 కాగా, 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ కోహ్లీ. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలో వరుసగా డక్ అవ్వడం ఆయన ఫామ్‌పై సందేహాలు కలిగిస్తోంది.
ఈ సిరీస్ ఆయనకు దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ పునరాగమనం. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే రిటైర్ అయిన కోహ్లీ, వన్డేల్లో కొనసాగుతానని ప్రకటించినప్పటికీ, అడిలైడ్ ఘటనతో అభిమానులు ఆయన భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
66
మూడో వన్డేలో కోహ్లీ ఆడతారా?
భారత జట్టు మేనేజ్‌మెంట్ మూడో వన్డేలో కోహ్లీని ఆడిస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు ఆయన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావచ్చని ఊహిస్తున్నారు. అయితే కోహ్లీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
అడిలైడ్‌లో ఆయన ఇచ్చిన గుడ్‌బై వేవ్ ఒక సాధారణ ధన్యవాదమా లేక చివరి వీడ్కోలా అనే దానిపై స్పష్టత వచ్చే వరకు క్రికెట్ ప్రపంచం ఆయన నెక్స్ట్ మూవ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.