అడిలైడ్‌ అదురుతుంది అంతే.. కోహ్లీ దెబ్బ అలాంటిది మరి !

Published : Oct 21, 2025, 05:39 PM IST

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అడిలైడ్ ఓవల్ అంటే ఎంతో ఇష్టమైన గ్రౌండ్. ఇక్కడ అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. గురువారం ఇదే వేదికగా భారత్, ఆసీస్ మధ్య జరిగే రెండో వన్డేలో మరోసారి రికార్డు మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు.

PREV
15
అడిలైడ్ లో కోహ్లీ సూపర్ రికార్డులు

భారత్–ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఫ్లాప్ అయ్యారు. కానీ, రెండో వన్డే లో వీరి నుంచి పరుగుల సునామీ ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండో వన్డే గురువారం (23 అక్టోబర్) అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. ఇక్కడ కోహ్లీకి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి.

పెర్త్‌లో డక్ అవుట్ అయిన కోహ్లీ, ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన వేదికపై మరోసారి అదరగొట్టడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్లు ఈసారి కింగ్ కోహ్లీని ఎలా అడ్డుకుంటారనే ఆసక్తి నెలకొంది.

25
224 రోజుల తర్వాత మళ్లీ రంగంలోకి కోహ్లీ

224 రోజుల తర్వాత కోహ్లీ, రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చారు. కానీ మొదటి మ్యాచ్‌లో ఇద్దరూ నిరాశ పరిచారు. కోహ్లీ డక్ అవ్వగా, రోహిత్ కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.

టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఈ సీనియర్ ప్లేయర్ల భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి. 2027 ప్రపంచకప్ వరకు టీమ్ లో కొనసాగాలంటే ఈ సిరీస్‌లో ఇద్దరు పెద్ద స్కోర్లు చేయడం కీలకం.

35
అడిలైడ్ లో కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నాయి?

2012 నుండి 2019 వరకు అడిలైడ్ ఓవల్ విరాట్ కోహ్లీ అడ్డాగా మారింది. ఈ మైదానంలో మూడు ఫార్మాట్లలో కలిపి ఆయన 975 పరుగులు చేశారు. అందులో 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో కోహ్లీ బ్యాటింగ్ సగటు 65.00. ఇది ఆస్ట్రేలియాలో ఒక విదేశీ ఆటగాడి అత్యధిక బ్యాటింగ్ సగటు కావడం విశేషం.

ఇక్కడ కోహ్లీ తన మొదటి సెంచరీ 2011–12 టెస్ట్ సిరీస్‌లో సాధించాడు. 2014లో ఎంఎస్ ధోనీ లేని సమయంలో జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తూ డబుల్ సెంచరీ కూడా చేశాడు. 2019లో 104 పరుగుల అద్భుత నాక్ తో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా భారత్‌కు వన్డే సిరీస్ గెలిపించాడు.

45
అడిలైడ్ వన్డేల్లో విరాట్ కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయి?

వన్డేల్లో కోహ్లీకి అడిలైడ్ కలిసొచ్చిన గ్రౌండ్. ఇక్కడ ఆయన 4 వన్డేలు ఆడగా, రెండు సార్లు ఫ్లాప్ అయినా రెండు సార్లు సెంచరీలు సాధించాడు. 2015లో పాకిస్తాన్‌పై 107 బంతుల్లో 126 పరుగులు నాక్ ఆడాడు. ఆ తర్వాత 2019లో ఆస్ట్రేలియాపై 112 బంతుల్లో 104 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. 61 బ్యాటింగ్ సగటుతో మొత్తం 244 పరుగులు చేశాడు. అడిలైడ్ అంటే కోహ్లీకి ఎంత ప్రత్యేకమైనదో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

55
అడిలైడ్ లో నిర్ణయాత్మక ఫైట్

కోహ్లీకి అడిలైడ్ ఓవల్ అంటే హోమ్ అవే ఫ్రం హోమ్ లాంటిది. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇక్కడే పాకిస్తాన్‌పై 82* పరుగులతో భారత్‌ను విజేతగా నిలిపాడు. ఆ మ్యాచ్ తర్వాత ఆయన ఆటలో కొత్తదనం వచ్చింది. ఇప్పుడు 36 ఏళ్ల కోహ్లీకి ఇది ఆ మైదానంలో చివరి వన్డే కావొచ్చు. అందుకే అభిమానులు ఆయన నుంచి మరో విరాట్ క్లాస్ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు.

మొదటి వన్డేలో భారత్ 131 పరుగుల లక్ష్యాన్ని రక్షించలేకపోయింది. కంగారూలు కేవలం 3 వికెట్లు కోల్పోయి గెలిచారు. ఇప్పుడు అడిలైడ్ లో భారత బ్యాటింగ్ పెద్ద పరీక్ష ఎదుర్కొంటుంది. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్‌ల బౌలింగ్‌ను ఎదుర్కొని కోహ్లీ మరోసారి తనదైన శైలిలో ఆస్ట్రేలియాను చిత్తు చేస్తారా అనేది ఆసక్తిని పెంచుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories