Viral Video: స్మృతి మంధాన ప్రేమ క‌థ తిరిగి మొద‌లైందా.? వైర‌ల్ అవుతోన్న వీడియో

Published : Apr 09, 2026, 02:06 PM IST

Viral Video: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె పెళ్లి ఆగిపోయిందనే వార్తలు వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ జంట మ‌ళ్లీ క‌లిసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

PREV
15
వైరల్ వీడియోతో మళ్లీ చర్చ

ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక వీడియో తెగ‌ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పలాష్ ముచ్చల్ సోదరి, గాయని పాలక్ ముచ్చల్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానతో కలిసి కనిపిస్తున్నారు. పాలక్ ముచ్చల్ గౌరవంగా మంధాన తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగయ్యాయని ఊహిస్తున్నారు. దీంతో మంధాన–పలాష్ పెళ్లి విషయం మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది.

25
గతంలో ఆగిపోయిన పెళ్లి

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఇద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరి పెళ్లి 2025 నవంబర్‌లో ఘనంగా జరగాల్సిందిగా ప్లాన్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. వివాహానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా ఆ పెళ్లి ఆగిపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

35
వివాదాలకు కారణమైన వార్తలు

పెళ్లి రద్దు కావడానికి అసలు కారణం ఏమిటనే విషయంపై అప్పట్లో ఎన్నో కథనాలు వెలువడ్డాయి. కొన్ని క‌థ‌నాల ప్రకారం పలాష్ మరో యువతితో చాటింగ్ చేసినట్టు స్క్రీన్‌షాట్లు బయటకు వచ్చాయని వార్తలు వినిపించాయి. దీంతో మంధాన ఈ పెళ్లిని రద్దు చేసుకుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయంపై రెండు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

45
పాత వీడియోనా.. కొత్తదా?

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో నిజంగా ఇటీవల తీసిందేనా లేక పాతదా అనే అంశంపై స్పష్టత లేదు. కొంతమంది ఇది గతంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో కావచ్చని అంటున్నారు. మరికొందరు మాత్రం ఇటీవలే రెండు కుటుంబాలు కలుసుకున్నాయని, విభేదాలు తొలగిపోయాయని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై స్మృతి మంధాన లేదా పలాష్ ముచ్చల్ కుటుంబం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.

55
అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

స్మృతి మంధాన భారత మహిళా క్రికెట్‌లో ప్రముఖ ఆటగాళ్లలో ఒకరు. మైదానంలో ఆమె ఆటతీరు ఎంత ప్రజాదరణ పొందుతుందో, ఆమె వ్యక్తిగత జీవితం కూడా అభిమానుల్లో అంతే ఆసక్తి కలిగిస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోతో మంధాన–పలాష్ సంబంధంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. నిజంగా ఈ జంట మళ్లీ కలిసిపోతుందా లేదా అన్నది వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories