కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలోనూ అతడి పాత్ర మర్చిపోలేం. అంత మంచి బౌలర్ కూ కష్టాలు తప్పలేదు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తనని తీసేసినప్పుడు డిప్రెషన్, బెదిరింపులు ఎదుర్కొన్నానని వరుణ్ చక్రవర్తి తెలిపాడు.
టీమ్ ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తనని జట్టు నుంచి తీసేసినప్పుడు ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుణ్ చక్రవర్తి బాగా ఆడాడు.
సెమీఫైనల్, ఫైనల్‌లో ఇండియా గెలవడానికి చక్రవర్తి చాలా ముఖ్యం అయ్యాడు. దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడు. ఫైనల్‌లో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీశాడు. అయితే, నాలుగేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తికి పరిస్థితులు అంత బాగా లేవు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తనని జట్టు నుంచి తీసేశారు.
25
ఒక యూట్యూబ్ షోలో చక్రవర్తి మాట్లాడుతూ.. టీ20 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాక తను న్యాయం చేయలేకపోయానని డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పాడు.
“అది నాకు చాలా కష్టమైన సమయం. ప్రపంచ కప్‌కు ఎంపికవడం చాలా సంతోషం కలిగించింది. కానీ నేను సరిగ్గా ఆడలేకపోయా. వికెట్లు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా” అని వరుణ్ చెప్పాడు.
35
Image Credit: ANI
నా కారణంగానే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందనీ, నేను ఇండియాకు తిరిగి రావద్దని కొందరు తనను హెచ్చరించారని, బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు.
“2021 ప్రపంచ కప్ తర్వాత నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొంతమంది నా ఇంటికి వచ్చారు, నన్ను వెంబడించారు. కొన్నిసార్లు నేను దాక్కోవాల్సి వచ్చింది.
“కానీ అప్పుడు జరిగిన వాటిని, ఇప్పుడు పొందుతున్న ప్రశంసలను చూస్తే నాకు సంతోషంగా ఉంది” అని వరుణ్ అన్నాడు.
45
Image Credit: ANI
రెండేళ్లుగా ఐపీఎల్‌లో, దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడటంతో వరుణ్ చక్రవర్తిని టీమ్ ఇండియాలోకి మళ్లీ తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీనికోసం తన దినచర్యను మార్చుకున్నానని చెప్పాడు.
“2021 తర్వాత నేను చాలా మార్పులు చేసుకున్నాను. నా దినచర్యను, ప్రాక్టీస్‌ను మార్చుకున్నాను. నేను దీన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాను” అని వరుణ్ అన్నాడు.
55
Image Credit: Getty Images
ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీయడం గురించి చక్రవర్తి మాట్లాడుతూ.. ఆ టోర్నమెంట్ తనకు నమ్మకాన్ని ఇచ్చిందని చెప్పాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. నేను నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. కానీ ఇంత సక్సెస్ వస్తుందని నేను అనుకోలేదు” అని వరుణ్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌పై ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానని వరుణ్ చక్రవర్తి చెప్పాడు. గౌతమ్ గంభీర్ తనతో మాట్లాడి మ్యాచ్‌కు రెడీగా ఉండమని చెప్పాడని అన్నాడు.