Cricket : క్రికెట్ లో ఒక బ్యాటర్ ను 10 రకాలుగా ఔట్ చేయొచ్చు తెలుసా?

Published : Mar 15, 2025, 08:54 AM ISTUpdated : Mar 15, 2025, 12:18 PM IST

Cricket: క్యాచ్, ర‌నౌట్, వికెట్ హిట్ మాత్ర‌మే కాకుండా క్రికెట్ లో ఒక బ్యాట్స్ మెన్ 10 విధాలుగా త‌న వికెట్ ను కోల్పోయే అవ‌కాశముంది. 

PREV
16
Cricket : క్రికెట్ లో ఒక బ్యాటర్ ను 10 రకాలుగా ఔట్ చేయొచ్చు తెలుసా?
Rohit Sharma. (Photo- BCCI X/@BCCI)

Cricket: క్రికెట్ లో ఒక బ్యాట్స్ మెన్ త‌న వికెట్ ను ఎలా కోల్పోతాడు అని ఆడిగితే చాలా మంది ట‌క్కున బౌల్డ్, క్యాచ్ అవుట్, ర‌నౌట్, ఎల్బీడ‌బ్ల్యూ అనే స‌మాధాన‌మిస్తారు. అయితే, ఇవే కాకుండా ఇంకా చాలా విధాలుగా ఒక బ్యాట్స్ మెన్ క్రికెట్ లో తన వికెట్ ను కోల్పోవచ్చు. క్రికెట్ లో ఒక ప్లేయ‌ర్ త‌న వికెట్ ను 10 విధాలుగా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

26

1. బౌల్డ్ - బ్యాట‌ర్ క్రీజులో ఉండి ఆడుతుండ‌గా బౌల‌ర్ వేసిన బంతి నేరుగా వికెట్ల‌ను తాకి, బెయిల్స్ కింద‌ప‌డితే ఔట్ అవుతాడు. 

2. క్యాచ్ - ఒక ప్లేయ‌ర్ బౌల‌ర్ వేసిన లీగ‌ల్ డెలివ‌రిని ఆడితే అది నేరుగా గ్రౌండ్ ను తాక‌కుండా ఫీల్డర్, వికెట్ కీపర్ లేదా బౌలర్  చేతిలో ప‌డితే అంటే అందుకుంటే క్యాచ్ రూపంలో ఔట్ అవుతాడు. 

36
Dhoni Run Out

3. లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ) - స్టంప్స్ కు అనుగుణంగా బంతి బ్యాట్స్మన్ శరీరంలోని ఏదైనా భాగాన్ని (సాధారణంగా కాలు) తాకుతుంది. అది స్టంప్లను తాకుతుందని అంపైర్ నమ్మి అవుట్ ఇవ్వ‌డం.

4. రనౌట్ - బ్యాట్స్ మన్ క్రీజు నుంచి బయటకు వచ్చి బ్యాట్స్ మన్ తిరిగి క్రీజులోకి రాకముందే ఫీల్డింగ్ టీమ్ స్టంప్ లను బాల్ తో తాకితే అవుట్ కావ‌డం. 

46

5. స్టంప్డ్ - బ్యాట్స్ మెన్ క్రీజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వికెట్ కీపర్ బాల్ తో బెయిల్స్ ను కింద‌ప‌డేలా చేస్తే అవుట్ కావ‌డం. సాధారణంగా ఇది ప్లేయ‌ర్ పరుగుకు ప్రయత్నించినప్పుడు లేదా ముందుకు వ‌చ్చి బిగ్ షాట్ ఆడే స‌మ‌యంలో ఇలాంటి అవుటు చూస్తుంటాం. 

6. హిట్ వికెట్ - బ్యాట్స్ మెన్ నిలబడి ఉన్నప్పుడు లేదా షాట్ ఆడుతున్నప్పుడు పొరపాటున తన బ్యాట్ లేదా త‌న శ‌రీరంతో వికెట్ల‌ను తాక‌డం వ‌ల్ల కూడా అవుట్ అవుతాడు. 

56

7. టైమ్డ్ అవుట్ - నిర్దేశించిన సమయంలో తర్వాతి బంతిని ఎదుర్కోవడానికి ఆట‌గాడు సిద్ధంగా లేకుంటే కూడా ఎంపైర్ అవుట్ గా ప్ర‌క‌టిస్తారు. 

8. ఫీల్డ్ కు ఆటంకం క‌లిగించ‌డం: బ్యాట‌ర్ కావాల‌నే ఫీల్డింగ్ అడ్డుకోవ‌డం చేస్తే కూడా అవుట్ గా ప్ర‌క‌టిస్తారు. దీని కోసం బ్యాట‌ర్ త‌న శ‌రీరం లేదా బ్యాట్ ను ఉప‌యోగించాడ‌ని అంపైర్ గుర్తిస్తే అవుట్ గా ప్ర‌క‌టిస్తారు. 

66
Oshane Thomas hit wicket

9. బంతిని తాక‌డం: మ్యాచ్ స‌మ‌యంలో బ్యాట్స్ మెన్ ఉద్దేశ‌పూర్వ‌కంగా బంతిని చేతిలో లేదా బ్యాట్ తో తాకితే కూడా అంపైర్ అవుట్ గా ప్ర‌క‌టిస్తారు. 

10. రిటైర్ అవుట్ - గాయం లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల ఒక బ్యాట‌ర్ తన ఇన్నింగ్స్ సమయంలో గ్రౌండ్ ను వీడిచి పెట్ట‌డం. ఇలాంటి స‌మ‌యంలో వారు బ్యాటింగ్ కొనసాగించడానికి తిరిగి రాలేరు. అలాగే, రిటైర్డ్ హర్ట్ కూడా అంతే గాయానికి గురై గ్రౌండ్ వీడితే కూడా ప్లేయ‌ర్ ను అవుట్ గా ప‌రిగ‌ణిస్తారు.

Read more Photos on
click me!