డిసెంబర్ 3న జరగనున్న 2వ వన్డే మ్యాచ్‌లో భారత జట్టులో ఒకే ఒక మార్పు ఉండే అవకాశం ఉందని సమాచారం. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రిషబ్ పంత్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.
మొదటి వన్డేలో తనకు లభించిన ఏకైక అవకాశాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో 2వ వన్డేలో అతని స్థానంలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ను ఆడించే అవకాశం ఉంది.
మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌లో, విరాట్ కోహ్లీ వన్-డౌన్‌లో, ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటారు.