IPL 2026: CSKపై పిచ్చికొట్టుడు.. బుడ్డోడు వైభవ్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.!

Published : Apr 01, 2026, 06:45 PM IST

IPL 2026: 14 ఏళ్లకే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి రికార్డులు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ, త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా.. 

PREV
15
బీసీసీఐ నుంచి బంపర్ ఆఫర్..

భారత క్రికెట్‌లో మరో అద్భుతమైన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్(IPL)లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు.

25
రికార్డుల వీరుడు

15వ ఏట అడుగుపెట్టిన వెంటనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. అండర్-19 జట్టు తరపున బరిలోకి దిగి తన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడానికి వయస్సు పరంగా ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోవడంతో, అతన్ని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

35
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక?

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ తన బ్యాటింగ్ పవర్‌ను నిరూపించుకున్నాడు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, టీ20 జట్టులో వైభవ్‌కు అవకాశం దక్కవచ్చని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. మైకేల్ వాన్ లాంటి దిగ్గజాలు కూడా బీసీసీఐకి ఇదే సూచన చేశారు.

45
హిట్టర్ల జట్టుకు మరింత బలం

ఇప్పటికే టీమిండియాలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి హిట్టర్లు ఉన్నారు. వీరికి తోడు వైభవ్ సూర్యవంశీ కూడా తోడైతే భారత జట్టును ఆపడం ఏ దేశానికైనా అసాధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

55
ప్రశంసల జల్లు

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్‌పై ప్రశంసలు కురిపిస్తూ, ప్రతి బంతిని స్టాండ్స్‌లోకి పంపే అతని సామర్థ్యం చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. వైభవ్ తమ జట్టులో ఉండటం నిజంగా ఒక వరం అని పరాగ్ కొనియాడాడు. మొత్తానికి అతి త్వరలోనే వైభవ్ సూర్యవంశీని బ్లూ జెర్సీలో చూడబోతున్నామని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories