ఆట తక్కువ.. పార్టీలు ఎక్కువ.! వన్డేలకు దూరం.. కోహ్లీ ఫ్రెండ్‌ను తీసేయండి బాసూ

Published : Nov 21, 2025, 10:18 AM IST

India: సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా, గాయం కారణంగా హార్దిక్ పాండ్యాకు చోటు ఉండకపోవచ్చు.  

PREV
15
వన్డే, టీ20లకు జట్టు ఎంపిక.!

సౌత్ ఆఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ఈ సిరీస్ నవంబర్ 30 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు నవంబర్ 26న గౌహతిలో ముగిసిన నాలుగు రోజుల వ్యవధిలోనే వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి వస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఫార్మాట్‌లోకి వారి రీఎంట్రీ భారత టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేయనుంది.

25
కొత్తగా ఏం మారింది..

అయితే, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ వన్డే జట్టులో లేకపోవచ్చు. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. జట్టులోకి తిరిగి వచ్చే ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన ఫామ్‌ను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు.

35
కోహ్లీ ఫ్రెండ్‌కి మళ్లీ రెస్ట్..

నవంబర్ 26 లేదా నవంబర్ 28న జరిగే మ్యాచ్‌లలో బరోడా తరపున హార్దిక్ బరిలోకి దిగే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాతో పాటు, జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చినట్లు సమాచారం. మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్‌మాన్ గిల్ కూడా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు దూరమైనందున, అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కవచ్చు.

45
పేస్, స్పిన్ విభాగంలో నో చేంజ్

పేసర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్‌లలో ముగ్గురికి మాత్రమే అవకాశం లభించవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నారు. స్పిన్ ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఆడనుండగా, అతనికి బ్యాకప్‌గా రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావచ్చని తెలుస్తోంది.

55
గిల్ ఆడకపోతే కెప్టెన్ అతడే..

అదనపు బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్‌కు అవకాశం లభించవచ్చు. పేస్ ఆల్ రౌండర్లు శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డిలలో ఒకరికి చోటు దక్కనుంది. ఈ వన్డే సిరీస్ తర్వాత ఐదు టీ20ల సిరీస్ కూడా జరగనుంది. ఇక గిల్ అటు వన్డే సిరీస్, ఇటు టీ20 సిరీస్‌లకు దూరమైతే.. వన్డేల్లో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, టీ20లకు వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories