పారిస్ ఒలింపిక్స్ లో చైనాకు చెక్ పెట్టిన అమెరికా.. అత్య‌ధిక మెడ‌ల్స్ గెలిచిన టాప్-5 దేశాలు ఇవే

First Published | Aug 11, 2024, 10:43 PM IST

Paris Olympics 2024 Final Medal Tally: పారిస్ ఒలింపిక్స్ లో చివరి గేమ్ లో విజయం సాధించి అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోగలిగింది. అమెరికా, చైనాలు 40-40 బంగారు పతకాలు సాధించినప్పటికీ చైనా రెండో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. 
 

USA, volleyball, Paris Olympics 2024

Paris Olympics 2024 Final Medal Tally: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న 33వ ఒలింపిక్ గేమ్స్ ఆదివారం మహిళల బాస్కెట్‌బాల్ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌తో ముగిశాయి. అమెరికా జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య ఫ్రాన్స్‌ను 67-66తో ఓడించి 40వ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ ఒలింపిక్స్ ప్రారంభం నుంచి మెడ‌ల్స్ సాధించ‌డంలో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన అమెరికా మెడల్స్ లో సెంచ‌రీని దాడి చైనాను వెన‌క్కి నెట్టింది. పారిస్ ఒలింపిక్స్ 2024 లో అత్య‌ధిక మెడ‌ల్స్ గెలిచిన దేశాల జాబితాలో అమెరికా టాప్ లో ఉండ‌గా, చైనా రెండో స్థానంలో ఉంది. 

పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్య పతకాలతో సహా మొత్తం 126 పతకాలు సాధించింది. రెండో స్థానంలో నిలిచిన చైనా 40 స్వర్ణాలతో కలిపి మొత్తం 91 పతకాలు సాధించింది. చైనా, అమెరికా రెండు దేశాల‌లు 40-40 బంగారు పతకాలను గెలుచుకున్నప్పటికీ చైనా 27 రజతాలు, 24 కాంస్య పతకాలను గెలుచుకుంది. దీంతో  చైనా 40 స్వర్ణాలు సాధించినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


పతకాల పట్టికలో జపాన్ మూడో స్థానంలో నిలిచింది. జపాన్ 20 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 45 పతకాలు సాధించింది. ఆస్ట్రేలియా 18 స్వర్ణాలు, 19 రజతాలు, 16 కాంస్య పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆతిథ్య ఫ్రాన్స్ 16 స్వర్ణాలు, 19 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలు సాధించి పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

Paris Olympics 2024, Neeraj Chopra

71వ స్థానంలో  భారత్ 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఒక రజతం, 5 కాంస్యాల‌తో మొత్తం 6 మెడ‌ల్స్ తో ప‌త‌కాల‌ పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. షూటింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు, అథ్లెటిక్స్‌లో ఒకటి, రెజ్లింగ్‌లో ఒకటి, హాకీలో ఒకటి వ‌చ్చాయి. జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించగా, భార‌త స్టార్ నీర‌జ్ చోప్రా సిల్వ‌ర్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. మిగ‌తా ఐదు కాంస్య ప‌త‌కాలు. 

పొరుగు దేశం పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో 62వ స్థానంలో నిలిచింది. అయితే, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం 7 పతకాలు సాధించి పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. టోక్యోతో పోలిస్తే పతకాల పట్టికలో భారత్ 23 స్థానాలు కోల్పోయింది.

Paris Olympics 2024 - Coxswain Henry Fieldman

టోక్యోలోనూ అమెరికాదే అగ్రస్థానం

టోక్యో ఒలింపిక్స్‌లో మొదటి స్థానంలో నిలిచిన అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి మొత్తం 113 పతకాలు సాధించింది. కాగా, చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తం 89 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు దేశాలు టోక్యో కంటే పారిస్‌లో మెరుగైన ప్రదర్శన చేసి తమ పతకాల సంఖ్యను పెంచుకున్నాయి. 

Latest Videos

click me!