యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?

Published : Sep 06, 2025, 07:29 PM IST

US Open 2025 Final : యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్‌లో అరీనా సబలెంకా, అమండా అనిసిమోవా తలపడనున్నారు. ఛాంపియన్ గా నిలిచేది ఎవరు? హెడ్ టూ హెడ్ రికార్డ్ లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ రంగం సిద్ధం

న్యూయార్క్‌లోని ఆర్తర్ యాష్ స్టేడియం వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం 1:30 am యూఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ఈ గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబాలెంకా, అమెరికా స్టార్ అమండా అనిసిమోవా తలపడనున్నారు. ఈ  మ్యాచ్ గెలుపు ఇద్దరికీ చారిత్రాత్మకం కానుంది.

DID YOU KNOW ?
యూఎస్ ఓపెన్ రికార్డులు
ఓపెన్ ఎరాలో యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్స్ అత్యధికంగా గెలిచిన వారు క్రిస్ ఎవర్ట్, సెరినా విలియమ్స్. ఇద్దరూ చెరో 6 సార్లు విజేతలయ్యారు.
25
వరుసగా రెండో టైటిల్ పై కన్నేసిన అరీనా సబాలెంకా

27 ఏళ్ల సబాలెంకా ఇప్పటివరకు మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకుంది. ఈసారి ఆమె లక్ష్యం నాలుగో టైటిల్ సాధించడం. ముఖ్యంగా, 11 ఏళ్లలో ఎవరూ వరుసగా రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలవలేదు. ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు సబాలెంకా కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. ఈ ఏడాది రెండు మెజర్ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఆమె, ఈ పోరులో తన పవర్ ను చూపిస్తూ జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది.

35
అనిసిమోవా కల నెరవేరేనా?

24 ఏళ్ల ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆమె ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. 2025లో మాడిసన్ కీస్, కోకో గాఫ్ తర్వాత మూడో అమెరికన్ మహిళా క్రీడాకారిణిగా గ్రాండ్ స్లామ్ గెలిచే అవకాశాన్ని అనిసిమోవా అందుకోవచ్చు.

45
సబాలెంకా vs అనిసిమోవా: హెడ్ టూ హెడ్ రికార్డులు

సబాలెంకా, అనిసిమోవా మధ్య ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 6-3 తేడాతో అనిసిమోవా ముందంజలో ఉంది. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 19 ఏళ్ల అనిసిమోవా సబాలెంకాను సెట్‌ల్లో ఓడించడంతో వీరి మధ్య పోటీ ప్రారంభమైంది. ఐదో పోరులో సబాలెంకా మొదటి విజయం సాధించింది. గ్రాండ్ స్లామ్‌ల్లో కూడా అనిసిమోవా 3-1 తేడాతో ఆధిక్యం కొనసాగిస్తోంది.

హార్డ్ కోర్ట్‌లో 2-1 తేడాతో అనిసిమోవా రికార్డు బలంగా ఉంది. ఇది సబాలెంకాకు ఇష్టమైన సర్ఫేస్ అయినప్పటికీ, అమెరికన్ స్టార్ ఆధిపత్యం చూపింది. చివరి పోరు వింబుల్డన్ 2025 సెమీఫైనల్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో అనిసిమోవా 6-4, 4-6, 6-4 తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ ఏకంగా రెండున్నర గంటల పాటు సాగింది.

55
యూఎస్ ఓపెన్ 2025 మహిళల ఫైనల్ ఎక్కడ, ఎప్పుడు చూడాలి? లైవ్ వివరాలు

యూఎస్ ఓపెన్ 2025 మహిళల ఫైనల్ సెప్టెంబర్ 6న  అమెరికా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు (EDT, GMT-4) ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం 1:30 am ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆర్తర్ యాష్ స్టేడియంలో జరిగే ఈ పోరు ప్రపంచ వ్యాప్తంగా లైస్ స్ట్రీమింగ్ కానుంది.

• అమెరికా, దక్షిణ అమెరికా, కరేబియన్, న్యూజిలాండ్: ESPN లో లైవ్ వస్తుంది.

• యూరప్ (ఫ్రాన్స్ సహా): Eurosport

• యూకే, ఇటలీ, జర్మనీ: Sky Sports

• భారతదేశం: Star Sports

• ఆఫ్రికా: beIN Sports, SuperSport

• ఆస్ట్రేలియా: Nine, Stan Sport

• కెనడా: RDS, TSN

Read more Photos on
click me!

Recommended Stories