అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన టాప్ దేశాలు ఇవే

First Published Jul 24, 2024, 5:06 PM IST

Nations with Most Olympic Medals : భార‌త్ ఇప్పటి వరకు మొత్తం 35 ఒలింపిక్ పతకాలను సాధించింది. ఇందులో 10 బంగారు పతకాలు ఉన్నాయి. అందులో భారత పురుషుల హాకీ జట్టు 8 గెలుచుకుంది.
 

Olympics

Nations with Most Olympic Medals : ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగే 33వ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2024 జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సారి జ‌రిగే పారిస్ ఒలింపిక్స్ కు పురుష‌, స్త్రీ అథ్లెట్లకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది అంటే సమాన సంఖ్యలో ఈవెంట్‌లు ఉంటాయి. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌త‌కాలు గెలుచుకున్న దేశాల జాబితా లో (విజువల్ క్యాపిటలిస్ట్) అమెరికా టాప్ లో ఉంది. 

Top 6 countries with the most Olympic medals : 

1. అమెరికా (యూఎస్ఏ)

ఒలింపిక్ చరిత్రలో అత్యధిక మెడల్స్ గెలుచుకున్న దేశం అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్ఏ) ఇప్పటివరకు మొత్తం 2959 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఇందులో 1175 బంగారు పతకాలు ఉన్నాయి. అలాగే, 951 వెండి పతకాలు, 833 కాంస్య పతకాలను గెలుచుకుంది.

Latest Videos


2. సోవియట్ యూనియన్

సోవియట్ యూనియన్ మొత్తం 1204 ఒలింపిక్ మెడల్స్ గెలుచుకుంది. ఇందులో 473 గోల్డ్ మెడల్స్, 376 వెండి పతకాలు, 355 కాంస్య పతకాలు ఉన్నాయి. 

3. జర్మనీ 

ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన మూడో దేశం జర్మనీ. మొత్తం 922 ఒలింపిక్స్ మెడల్స్ సాధించింది. ఇందులో 305 బంగారు, 305 వెండి, 312 కాంస్య పతకాలు ఉన్నాయి. 

4. గ్రేట్ బ్రిటన్ 

గ్రేట్ బ్రిటన్ మొత్తం 950 ఒలింపిక్ మెడల్స్ సాధించింది. ఇందులో 296 బంగారు, 323 వెండి, 331 కాంస్య పతకాలు ఉన్నాయి. 

Paris Olympics

5. ఫ్రాన్స్ 

ఒలింపిక్స్ లో ఫ్రాన్స్ ఇప్పటివరకు 889 పతకాలు సాధించింది. ఇందులో 264 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అలాగే, 293 వెండి, 322 కాంస్య పతకాలు కూడా గెలుచుకుంది. 

6. చైనా 

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా ఇప్పటివరకు 713 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఇందులో 285 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 231 వెండి, 197 కాంస్య పతకాలు సాధించింది. 

click me!