మహిళల ప్రపంచ కప్ 2025లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు

Published : Nov 03, 2025, 02:05 AM IST

Most Runs In Womens World Cup 2025: మహిళల ప్రపంచ కప్ 2025లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ టాప్ లో నిలిచారు. టాప్ 5 జాబితాలో భారత ప్లేయర్లు కూడా చోటుదక్కించుకున్నారు.

PREV
16
మహిళా ప్రపంచ కప్ 2025లో బ్యాటర్ల దూకుడు

2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌ లో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. అయితే, ఈ టోర్నమెంట్ లో పలువురు ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితా అధికారికంగా విడుదలైంది. దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ లారా వోల్వార్డ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె బ్యాటింగ్ స్థిరత్వం, ఆత్మవిశ్వాసం జట్టును ముందుకు నడిపించాయి. మహిళా ప్రపంచ కప్ 2025 లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్ల లిస్టు గమనిస్తే..

26
1. లారా వోల్వార్డ్

దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ మహిళా ప్రపంచ కప్ 2025 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచారు. ఆమె 9 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌ ఆడి 571 పరుగులు సాధించారు. ఆమె సగటు 71.38, స్ట్రైక్ రేట్ 98.79గా ఉంది. మొత్తం 73 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. ఆమె ప్రదర్శన దక్షిణాఫ్రికా జట్టుకు కీలకం అయింది. ప్రతి మ్యాచ్‌లోనూ తన ఆత్మస్థైర్యాన్ని చూపి, టోర్నమెంట్‌లో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్‌గా నిలిచారు. ఫైనల్ మ్యాచ్ లో కూడా సెంచరీ నాక్ ఆడారు. కానీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

36
2. స్మృతి మంధాన

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచారు. మహిళా ప్రపంచ కప్ 2025 లో 9 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌ ఆడి 434 పరుగులు సాధించారు. ఆమె సగటు 54.25, స్ట్రైక్ రేట్ 99.09గా ఉంది. ఈ ప్రదర్శనలో 50 ఫోర్లు, 9 సిక్సర్లు బాదారు. స్మృతి మంధాన తన సాలిడ్ టెక్నిక్‌తో, అగ్రెసివ్ షాట్లతో భారత జట్టును ముందుకు నడిపించారు. ఆమె స్థిరమైన ఆటతీరు కారణంగా భారత్‌ ఫైనల్ వరకు దూసుకెళ్లగలిగింది.

46
3. ఆష్లీ గార్డనర్

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించారు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ మాత్రమే ఆడినా ఆమె 328 పరుగులు చేశారు. ఆమె సగటు 82.00, స్ట్రైక్ రేట్ 130.16గా ఉంది. ఆష్లీ గార్డనర్ 39 ఫోర్లు, 6 సిక్సర్లు బాదారు. ఆస్ట్రేలియా జట్టు మిడిల్ ఆర్డర్ లో ఆమె ఆట ప్రదర్శన టోర్నమెంట్‌లో కీలక పాత్ర పోషించింది.

56
4. ప్రతీకా రావల్

భారత యువ ప్రతిభావంతురాలైన ప్రతీకా రావల్ గాయం కారణంగా సెమీస్ నుంచి భారత జట్టుకు దూరం అయ్యారు. రావల్ 7 మ్యాచ్‌లలో 6 ఇన్నింగ్స్‌ ఆడి 308 పరుగులు సాధించారు. ఆమె సగటు 51.33, స్ట్రైక్ రేట్ 77.78గా ఉంది. ఈ ప్రదర్శనలో 37 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రతీకా బ్యాటింగ్‌లోని సమతుల్య ధోరణి, బిగ్ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం భారత జట్టుకు భవిష్యత్తులో గొప్ప ఆస్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

66
5. ఫోబ్ లిచ్‌ఫీల్డ్

ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 7 మ్యాచ్‌ల్లో 7 ఇన్నింగ్స్‌ ఆడి 304 పరుగులు చేశారు. ఆమె సగటు 50.67, స్ట్రైక్ రేట్ 112.18గా ఉంది. మొత్తం 43 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. లిచ్‌ఫీల్డ్‌ దూకుడు ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలో గట్టి బలాన్నిచ్చింది.

మొత్తంగా 2025 మహిళల ప్రపంచ కప్‌లో బ్యాటర్ల ప్రదర్శన రసవత్తరంగా సాగింది. లారా వోల్వార్డ్ స్థిరత్వం, మంధాన‌ క్లాస్‌, అష్లీ పవర్‌హిట్టింగ్‌, యువ ఆటగాళ్ల ఉత్సాహం.. అన్నీ టోర్నమెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories