Shree Charani: అందరూ తడబడ్డా ఆమె మాత్రం అదరగొట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి (Shree Charani).. తన తొలి ICC Women's Cricket World Cup 2025లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు విజయాన్ని అందించింది.
అందరూ తడబడ్డా ఆమె అదరలేదు. బెదరలేదు. అరివీర భయంకరులకు కళ్లెం వేసింది. తొలి ప్రపంచ కప్‌లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మహిళా క్రికెటర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఐసీసీ వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో సూపర్’ ఇంపాక్ట్ క్రియెట్ చేసింది.
24
ప్రపంచ కప్‌లో ఆడటం ఇదే తొలిసారి
21 ఏళ్ల యువ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనతో 2025 మహిళల ప్రపంచకప్‌లో (ICC Women's World Cup 2025) భారత్ ఫైనల్‌లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది ఏప్రిల్ 27న శ్రీలంకపై ODI అరంగేట్రం చేసినప్పటికీ, ప్రపంచ కప్‌లో ఆడటం ఆమెకు ఇదే తొలిసారి.
34
అత్యంత ప్రభావవంతమైన బౌలర్..
ప్రపంచ కప్ 2025లో చరణి అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా మారింది. ఆమె టోర్నమెంట్‌లో 13 వికెట్లు పడగొట్టింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (17 వికెట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. క్లిష్టమైన సందర్భాల్లో ఆమె చూపిన కంట్రోల్ & మ్యాచురిటీ ఆమె ప్రదర్శనలో అత్యంత కీలకమైనవి.
ఆమె ప్రదర్శన అత్యంత కీలకం..
ముఖ్యంగా, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఫైనల్‌కు చేర్చిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ప్రదర్శన అత్యంత కీలకం. నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇతర భారత బౌలర్లపై విరుచుకుపడుతున్న సమయంలో—దీప్తి శర్మ ఎకానమీ 7.42, రాధా యాదవ్ ఎకానమీ 8.25 నమోదు చేయగా—శ్రీ చరణి తన 10 ఓవర్ల స్పెల్‌లో 4.90 ఎకానమీ రేటుతో కేవలం 49 పరుగులు మాత్రమే ఇచ్చి, 2 కీలక వికెట్లు తీసింది. ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ ఆస్ట్రేలియా దూకుడుకు కళ్లెం వేసింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమె అద్భుతంగా రాణించింది. 10 ఓవర్లలో 41 పరుగులు మాత్రమే ఇచ్చి, 3 వికెట్లు (అలీస్సా హీలీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అన్నబెల్ సదర్లాండ్) పడగొట్టింది.
చరణి ప్రదర్శనపై భారత కోచ్ అమోల్ ముజుందార్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టుపై కూడా కేవలం 40 పరుగులు మాత్రమే ఇచ్చి, ముఖ్యమైన వికెట్లు తీయడం అద్భుతమని ఆయన కొనియాడారు. చరణి అరంగేట్ర ప్రపంచ కప్ ప్రదర్శన, ఆమె కేవలం భర్తీగా రాలేదని, భారత స్పిన్ యూనిట్‌కు ఒక 'ఎక్స్ ఫ్యాక్టర్' గా, పెద్ద వేదికపై ఎదిగిన వీరవనితగా నిరూపించింది.