1. రియో డి జనీరో-2016
రియో డి జనీరో-2016లో నిర్వహించిన విశ్వక్రీడలు అత్యంత ఖరీదైన సమ్మర్ ఒలింపిక్ గేమ్స్. ఇక్కడ నిర్వహించిన ఒలింపిక్ గేమ్స్ కోసం $23 బిలియన్లు ఖర్చు చేశారు. ఒలింపిక్స్‌ను నిర్వహించే హక్కులను గెలుచుకున్న తర్వాత ఈ నగరం కీలకమైన మూడు ప్రజా రవాణా మార్గాలను అభివృద్ధి చేసింది. అవి బస్ రాపిడ్ ట్రాన్సిట్ (BRT), మెట్రో, లైట్ వెహికల్ రైల్ సిస్టమ్. 2016 ఆగస్టు 5 నుంచి 21 వరకు దక్షిణ అమెరికాలో ప్రఖ్యాత బ్రెజిలియన్ నగరం తొలిసారిగా విశ్వక్రీడలను నిర్వహించింది. ఈ నగరం ఒలింపిక్ చరిత్రలో క్రీడలను నిర్వహించడానికి అత్యధిక డబ్బును ఖర్చు చేసింది.
2. లండన్ - 2012
లండన్ 2012 సమ్మర్ ఒలింపిక్స్ కోసం $16.8 బిలియన్లను ఖర్చు చేశారు. దీంతో ఒలింపిక్ హిస్టరీలో అత్యంత ఖరీదైన గేమ్స్ లో రెండో స్థానంలో ఉన్నాయి. ఒలింపిక్స్ క్రమంలో లండన్ పది కొత్త రైల్వే లైన్‌లు, 30 కొత్త వంతెనలను నిర్మించింది. లండన్ అంతటా పాదచారులు, సైక్లింగ్ మార్గాలను అప్‌గ్రేడ్ చేయడానికి కూడా భారీగా ఖర్చు చేసింది. లండన్ ఒలింపిక్స్ 27 జూలై నుంచి 12 ఆగస్టు 2012 వరకు జరిగాయి.
Tokyo, Japan
3. టోక్యో - 2020
టోక్యో 2020 ఒలింపిక్స్ మూడవ అత్యంత ఖరీదైన సమ్మర్ ఒలింపిక్ క్రీడలు. దీని కోసం చైనా $13.7 బిలియన్లను ఖర్చు చేసింది. ప్రారంభ, ముగింపు వేడుకల కోసం కొత్త జాతీయ ఒలింపిక్ స్టేడియంతో సహా, క్రీడల కోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త వేదికలను నిర్మించడం కోసం భారీగా ఖర్చు చేసింది.
4. బార్సిలోనా - 1992
బార్సిలోనా 1992 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 4వ అత్యంత ఖరీదైన ఒలింపిక్ గేమ్స్. ఈ క్రీడల కోసం $11.6 బిలయన్లను ఖర్చు చేసింది. బార్సిలోనా విమానాశ్రయ విస్తరణ, కొత్త రింగ్ రోడ్ల వ్యవస్థ, కొత్త హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌తో సహా ప్రజా రవాణా, కొత్త వేదికల కోసం భారీగా ఖర్చు చేసింది.
5. పారిస్ - 2024
విశ్వక్రీడల హిస్టరీలో 5వ అత్యంత ఖరీదైన సమ్మర్ ఒలింపిక్స్ పారిస్ 2024. పారీస్ ఈ ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ దాదాపు $8.7 బిలియన్ల నుంచి $9.7 బిలియన్లు ఖర్చు చేస్తోంది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.