Paris Olympics 2024 : బోనమెత్తిన మన తెలుగమ్మాయే ఒలింపిక్స్ లో మువ్వన్నెల జెండా పట్టింది... ఏం సీన్ గురూ..!

First Published | Jul 27, 2024, 10:00 AM IST

సరిగ్గా హైదరాబాద్ బోనాల వేళే పాారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ సెంటిమెంట్ తెలుగింటి ఆడబిడ్డ పివి సింధుకు కలిసివస్తుందని తెలుగోళ్లు నమ్ముతున్నారు. 

Paris 2024 Olympics

Paris Olympics 2024: పారిస్ లో ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 206 దేశాలు, 10,500 మంది అథ్లెట్లు, వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు, లక్షలాదిమంది ప్రేక్షకులు, అంబరాన్నంటే సంబరాలు... ఇలా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలతో సీన్ నది తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. నదిలోనే క్రీడాకారుల పరేడ్  సాగింది. 
 

Paris 2024 Olympics

పారిస్ ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి పివి సింధుకు అరుదైన గౌరవం దక్కింది. భారత అథ్లెట్ టీం కు నాయకత్వం వహిస్తూ మువ్వన్నెల భారత జెండా చేతబట్టి ముందుండి నడిపే అవకాశం ఆమెకు దక్కింది. మరో అథ్లెట్ శరత్ కమల్ తో కలిసి ప్లాగ్ బేరర్ గా వ్యవహరించారు తెలుగమ్మాయి పివి సింధు. ఇలా సీన్ నదిలో త్రివర్ణ పతాకం చేతబట్టి, సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న మన క్రీడాకారులను చూసి యావత్ భారతీయులు సగర్వంగా ఫీలయ్యారు. 

Latest Videos


PV Sindhu

ముఖ్యంగా త్రివర్ణ పతాకదారి పివి సింధు సాంప్రదాయ చీరకట్టులో మెరిసారు.  త్రివర్ణ భరితమైన ఆ చీర సింధు చాలాబాగా సూట్ అయ్యింది. ఎప్పుడూ క్రీడాదుస్తుల్లో కనిపించే సింధు ఇలా చీరకట్టులో చూస్తే అచ్చ తెలుగమ్మాయిలా అనిపించింది. షటిల్ కోర్టులో దూకుడుగా కనిపించే ఆమె త్రివర్ణ పతాకదారిగా ముఖంపై నవ్వులు చిందిస్తూ కనిపించారు. 
 

PV Sindhu

ఇలా చీరకట్టులో పివి సింధును చూసిన తెలుగోళ్లకు బోనాల పండగ గుర్తుకువచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో మరీముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ లో బోనాల పండగ జరుగుతోంది.  అయితే ఈ బోనాల వేడుకల్లో పివి సింధు కూడా పాల్గొంటారు. చాలాసార్లు ఆమె బోనమెత్తారు. ఇప్పుడు ఇదే సమయంలో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. అమ్మవారి బోనమెత్తినప్పుడూ, పారిస్ లో మువ్వన్నెల జెండా పట్టినపుడు సింధు సాంప్రదాయబద్దంగా చీరలో కనిపించారు. సీన్ నదిలో సింధును చూసిన హైదరబాదీలు బోనాల సీన్ గుర్తుచేసుకుంటున్నారు.
 

PV Sindhu

 బోనాల వేళ జరుగుతున్న ఈ ఒలింపిక్స్ లో మన తెలుగింటి ఆడబిడ్డ పివి సింధుకు అమ్మవారి ఆశిస్సులు మెండుగా వుండాలని కోరుకుంటున్నారు. గతంలో బోనమెత్తిన సింధు ఈసారి గోల్డ్ మెడల్ కొట్టేలా చూడాలని అమ్మవారిని కోరుతున్నారు. సింధు కూడా ఈసారి గోల్డ్ కొడతానన్న ధీమాతో వున్నారు.
 

Paris 2024 Olympics

ఇక పారిస్ ఒలింపిక్స్ లో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీళ్లంతా ప్రారంభ వేడుకల్లో భారత సాంప్రదాయం ఉట్టిపడే దుస్తుల్లో కనిపించారు. మహిళా అథ్లెట్లు చీరకట్టులో, పురుషులు కుర్తాలో కనిపించారు. ఎంతో ఆకర్షనీయంగా వున్న వీరి సాంప్రదాయ వేషధారణ దేశ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. 

PV Sindhu

పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. గ‌త ఒలింపిక్స్ లో గెలిచిన ప‌త‌కాల కంటే ఈసారి డబుల్ మెడ‌ల్స్ గెలుచుకోవాల‌ని భార‌త భావిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. ఈసారి భారత జెండా మోసిన ఆమె గోల్డ్ మెడ‌ల్ తో మరోసారి మువ్వన్నెల జెండాను భుజాలపై ధరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆమె అద్భుత ఆటతీరుకు అమ్మవారి ఆశిస్సులు తోడయితే గోల్డ్ మెడల్ దక్కడం ఖాయమే. 

click me!