Paris Olympics 2024 Opening Ceremony : ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్నాయి. పారిస్ ఒలింపిక్స్ 2024 గ్రాండ్ ఓపెనింగ్ జూలై 26 మొదలుకాగా, ఆగస్టు 11న ఈ విశ్వక్రీడలు ముగియనున్నాయి. సీన్ నది ఒడ్డున పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, తన ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ క్రీడల నుండి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో భారతదేశ పతాకధారులుగా మారిన మొదటి క్రీడాకారులు.
news
శనివారం 12.30 AM భారత అభిమానుల నిరీక్షణ ముగిసింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ నేతృత్వంలో బోట్‌పై ప్రయాణిస్తున్న భారత క్రీడాకారులు ప్రేక్షకుల అభినందనలు స్వీకరిస్తూ ఈ ఫ్లోటింగ్ పరేడ్‌లో పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. అయితే, వర్షం మధ్య ప్రారంభోత్సవం కొనసాగింది. నీటిపై సాగిన ఈ పరేడ్‌లో ఈజిప్టు ఆటగాళ్ల తర్వాత కొద్ది సేపటికే భారత జట్టు కూడా పరేడ్ లో పాల్గొంది.
ఫ్లోటింగ్ పరేడ్‌లో క్యూబా 52వ స్థానంలో వుండగా, భారత్ సంఖ్య 84. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది, ఇది ఒలింపిక్ క్రీడల చరిత్రలో భారత్ కు అత్యుత్తమ ప్రదర్శన. ఇందులో భారత ఆటగాడు నీరజ్ చోప్రా తొలి అథ్లెటిక్స్ స్వర్ణం కూడా ఉంది. పారిస్‌లో 16 క్రీడాంశాల్లో 69 పతక ఈవెంట్లలో దేశం నుండి మొత్తం 112 మంది అథ్లెట్లు పాల్గొంటారు. ఐదుగురు రిజర్వ్ అథ్లెట్లు కూడా పారిస్‌లో ఉంటారు.
ఫ్లోటింగ్ పరేడ్‌లో కళాకారుల అద్భుతమైన ప్రదర్శన కూడా కనిపించింది. దాదాపు 80 మంది కళాకారులు ప్రసిద్ధ ఫ్రెంచ్ క్యాబరే నృత్యం 'కెన్-కెన్' ప్రదర్శించారు. లేడీ గాగా ప్రదర్శన తర్వాత ఫ్లోటింగ్ పెరేడ్ మళ్లీ ప్రారంభమైంది. బంగ్లాదేశ్, బెల్జియం వంటి దేశాల నుంచి క్రీడాకారులు పరేడ్‌లో పాల్గొన్నారు. దీని తర్వాత భారత్ పొరుగు దేశం చైనా వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇచ్చే ప్రతి పతకంలో ఈఫిల్ టవర్ ఇనుప ముక్కలు పొందుపరచబడి ఉంటాయి. 20వ శతాబ్దంలో ఈఫిల్ టవర్ పునరుద్ధరణ సమయంలో ఈ ముక్కలను అసలు టవర్ నుండి తొలగించి భద్రపరిచారు.