టోక్యో ఒలింపిక్స్: స్విమ్మింగ్‌లోనూ నిరాశే... సజన్ ప్రకాశ్ హీట్ రేసులో రెండో స్థానంలో నిలిచినా...

టోక్యో ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌లోనూ భారత జట్టుకి నిరాశే ఎదురైంది. 100 మీటర్ల మెన్స్ బటర్‌ఫ్లై ఈవెంట్‌లో పాల్గొన్న సజన్ ప్రకాశ్, సెమీస్‌కి అర్హత సాధించలేకపోయాడు... హీట్‌ 2 రేసులో రెండో స్థానంలో నిలిచినా సజన్‌కి అదృష్టం కలిసి రాలేదు...

Tokyo Olympics: Indian Swimmer Sajan Prakash finishes second in Heat 2 but failed to qualify CRA
ఓవరాల్‌గా 55 మంది స్విమ్మర్లు పాల్గొన్న ఈ రేసులో హీట్ 2లో 53.45 సెక్టన్లలో రేసును ముగించిన సజన్ ప్రకాశ్... రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఓవరాల్‌గా 16 హీట్లలో పాల్గొన్న టాప్‌లో నిలిచిన 16 మంది స్విమ్మర్లు మాత్రమే సెమీస్‌కి అర్హత సాధిస్తారు. ఓవరాల్‌గా 46వ స్థానంలో నిలిచిన సజన్‌కి నిరాశగా వెనుదిరిగాడు.
Tokyo Olympics: Indian Swimmer Sajan Prakash finishes second in Heat 2 but failed to qualify CRA
టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత జట్టుకి మిశ్రమ ఫలితాలను అందించింది. ఆరంభంలో అదిరిపోయే విజయాలు దక్కినా, సాయంత్రం నిరాశే ఎదురైంది... భారత సీనియర్ బాక్సర్ మేరీకోమ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో కొలంబియాకి చెందిన ఇన్‌గ్రిట్ వాలెన్సియాతో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో పోరాడి ఓడింది మేరీకోమ్.

తొలి రౌండ్‌లో వాలెన్సియా విజయం సాధించగా, రెండో రౌండ్‌లో మేరీ కోమ్ గెలిచింది. కీలకమైన మూడో రౌండ్‌లో కూడా మేరీకో‌మ్ గెలిచినా... ఓవరాల్‌గా దూకుడు చూపించిన వాలెన్సియా, ఎక్కువ పాయింట్లు సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న మేరీకోమ్, ఈసారి స్వర్ణ పతకం సాధించాలని భావించింది. అయితే 38 ఏళ్ల వయసులో మేరీకోమ్ ఒలింపిక్ మెడల్ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది.
భారత బాక్సర్ సతీశ్ కుమార్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. మెన్స్ సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో (91 కేజీల విభాగంలో) జమైకా బాక్సర్ రిచర్డో బ్రౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయం సాధించాడు సతీశ్ కుమార్.
ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌లోకి ప్రవేశించిన తొలి మెన్స్ బాక్సర్‌గా నిలిచాడు సతీశ్ కుమార్. ఇప్పటివరకూ బాక్సింగ్‌లో పోటీపడిన భారత మెన్స్ బాక్సర్లు ఆశీష్ కుమార్, వికాస్ కృష్ణన్, మనీశ్ కౌషిక్ తొలి రౌండ్‌లోనే ఓడిన విషయం తెలిసిందే.
మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లోఅథానుదాస్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. వరల్డ్ నెం.3 ఆర్చర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హూతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో షూట్ ఆఫ్‌లో విజయాన్ని అందుకున్నాడు అథానుదాస్.
బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. వరల్డ్ నెం.12 మియా బిల్చ్‌ఫ్లెట్‌తో జరిగిన మ్యాచ్‌లో21-15, 21-13 విజయాన్ని అందుకుంది పీవీ సింధు...
భారత పురుషుల హాకీ జట్టు, అర్జెంటీనాపై 3-1 విజయాన్ని అందుకుని, క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది...
భారత యంగ్ షూటర్ మను బకర్, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 292 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచి తర్వాత రౌండ్‌కి అర్హత సాధించింది. మరో షూటర్ రాహీ సర్నోబట్ 287 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది...
రోయింగ్‌లో భారత జోడి అర్వింద్ సింగ్, అర్జున్ లాల్... లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ ఈవెంట్‌‌ను ఐదో స్థానంతో ముగించారు.

Latest Videos

vuukle one pixel image
click me!