టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ముగ్గురు రిటైర్మెంట్ పక్కా.!

Published : Jan 13, 2026, 07:49 PM IST

T20 World Cup 2026: వయస్సు, ఫామ్, ఫిట్‌నెస్ కారణాలతో ముగ్గురు కీలక భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా కెరీర్‌లు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. 

PREV
15
మొదట ఉన్న ప్లేయర్ ఇతనే..

టీమిండియాలో రాబోయే కాలంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వయస్సు, ఫామ్, ఫిట్‌నెస్ కారణాలతో ముగ్గురు కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉండటం గమనార్హం.

25
సూర్య కెరీర్ కష్టంలో..

సూర్యకుమార్ యాదవ్ గత 25 అంతర్జాతీయ టీ20లలో కేవలం 244 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2024 బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు.

35
కేవలం టీ20లకే పరిమితం..

2026 టీ20 ప్రపంచకప్ తర్వాత అతని ఫామ్ మెరుగుపడకపోతే, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే క్రమంలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను కేవలం టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు.

45
అజింక్య రహనే కూడా..

అజింక్య రహానే 2023 జూలై నుంచి టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో టెస్టుల్లో కూడా రహానే పునరాగమనం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాదే అతను అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

55
రవీంద్ర జడేజా ఒకరు..

ఇక స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించేందుకు, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ లో భాగంగా 2026లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. టీమిండియా భవిష్యత్ ప్రణాళికలు ఈ ముగ్గురి కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories