Team India: విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. వరుసగా నాలుగు సెంచరీలు, మూడు సీజన్లలో 600కిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రిషభ్ పంత్ గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగినా.. పడిక్కల్‌కి స్థానం దక్కలేదు.
టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో తప్పక రాణించాల్సిందే. అయితే కొన్నిసార్లు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా, కొంతమందికి దురదృష్టవశాత్తు భారత స్క్వాడ్‌లో చోటు దక్కదు. ఈ కోవలోకి కర్ణాటకకు చెందిన బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వస్తాడు. కొన్నేళ్లుగా పడిక్కల్ నిలకడైన ప్రదర్శనతో భారత వన్డే జట్టులో కచ్చితంగా స్థానం దక్కించుకునేందుకు కృషి చేస్తున్నాడు.
25
విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్..
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను వరుసగా 147, 124, 22, 113, 108, 91, 35 పరుగులు సాధించాడు. అంతేకాదు, అంతకుముందు సీజన్లలో కూడా ఈ కర్ణాటక ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేకి ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంతో పడిక్కల్‌కు టీమిండియాలో చోటు దక్కుతుందని భావించారు. అయితే పంత్ వికెట్ కీపర్ కావడంతో అతని స్థానంలో మరొక వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు.
35
పడిక్కల్ మాట్లాడుతూ..
ఈ విషయంపై పడిక్కల్ మాట్లాడుతూ, పంత్ గాయంతో సిరీస్‌కు దూరమైనా, తనను ఎంపిక చేస్తారని తాను అనుకోలేదని చెప్పాడు. రిషభ్ వికెట్ కీపర్. అతను గాయపడితే, బ్యాకప్ వికెట్ కీపర్‌ను ఎంపిక చేస్తారు. దీంతో తనకు స్క్వాడ్‌లో పిలుపు వస్తుందని అనుకోలేదని అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్ నాలుగు సెంచరీలు బాదేశాడు. తాజాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో త్రిపురపై సెంచరీతో సత్తా చాటిన పడిక్కల్ ఈ సీజన్‌లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో ఇప్పటివరకు 640 పరుగులు చేసి ఈ టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పడిక్కల్ వరుసగా మూడోసారి విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేయడం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ మూడు సీజన్లలో 600కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. జార్ఖండ్ పై 147 పరుగులతో ఈ టోర్నీలో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్న ఈ కర్ణాటక బ్యాటర్, ఆ తర్వాత కేరళపై 124 పరుగులు చేశాడు. తమిళనాడుపై 22 పరుగులు మాత్రమే చేసినా, పుదుచ్చేరిపై 113 పరుగులతో మరో సెంచరీ చేశాడు.
55
కొనసాగింపు ఇలా..
ఆ తర్వాత త్రిపురపై 108 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్ 120 బంతుల్లో 108 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా లిస్ట్-ఏ ఫార్మాట్లో పడిక్కల్‌కు ఇది 13వ సెంచరీ. అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసి ఈ టోర్నీలో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇంత ఫామ్‌లో ఉన్నా కూడా దేవదత్ పడిక్కల్‌కు భారత జట్టులో స్థానం దక్కకపోవడం అనేది జట్టులో ఎంత పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.