ఓడినా సిగ్గు రాదేమో.! టీమిండియా నుంచి ఆ ఇద్దరు అవుట్.. టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే

Published : Dec 12, 2025, 04:51 PM IST

Team India: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ వైఫల్యం, హార్దిక్ పాండ్యా మెరుపులు.. రెండో టీ20లో కూడా ఇదే సమస్య.. ఈసారి తిలక్ మెరుపులు తప్పితే.. 

PREV
15
టీ20 ప్రపంచకప్ జట్టు ఇదేనా

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్ గెలించిందన్న ఆనందం లేకుండానే.. రెండో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ వైఫల్యం చెందింది టీమిండియా. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎలా ఉండబోతోందన్న దానిపై చర్చ మొదలైంది.

25
టాప్ 3 మళ్లీ ఫెయిల్

ఈ రెండు టీ20 మ్యాచ్‌లలోనూ టాప్ 3 బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇన్ని పేలవమైన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ.. ప్రపంచకప్ జట్టులో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ దాదాపుగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

35
ఆశలన్నీ మిడిలార్డర్ పైనే..

అలాగే, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తన దూకుడును కొనసాగించే అవకాశం ఉంది. ఇక జితేష్ శర్మ లోయర్ ఆర్డర్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు.

45
ఆ ప్లేయర్ మళ్లీ బెంచ్‌కే

దీని బట్టి చూస్తే సంజు శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. అర్షదీప్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని అందరూ అనుకుంటే.. రెండో వన్డేలో చేతులెత్తేశాడు. అయితేనేం ఓపెనింగ్ బౌలర్‌గా టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండటం కన్ఫర్మ్.

55
స్పెషలిస్ట్ స్పిన్నర్, ప్రధాన పేసర్ ఆ ఇద్దరే

కుల్దీప్ యాదవ్‌కు ప్రపంచకప్ జట్టులో ఛాన్స్ దక్కే అవకాశం లేదు. వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా, బూమ్రా ప్రధాన పేసర్‌గా ప్రపంచకప్‌లో టీమిండియా బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఇదే జట్టును కొనసాగించే అవకాశాలున్నాయని ఇప్పటికే మాజీ క్రికెటర్లు అంచనా వేసేశారు.

Read more Photos on
click me!

Recommended Stories